Breaking News

ఐదేళ్ల తర్వాత చేతికి పాస్‌పోర్ట్.. హీరోయిన్ భావోద్వేగం

Published on Sat, 10/04/2025 - 21:20

ఐదేళ్ల క్రితం లాక్‌డౌన్ టైంలో బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే ఈ విషయమై అప్పట్లో ఇతడి మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టు, కేసులు అంటూ ఆ కేసు చాన్నాళ్ల పాటు సాగుతూనే వచ్చింది. అయితే ఇన్నాళ్లకు ఈమెకు కొంతమేర విముక్తి దొరికినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నుంచి మాస్క్ మ్యాన్ ఎలిమినేట్.. కాకపోతే!)

దాదాపు ఐదేళ్ల తర్వాత పాస్‌పోర్ట్ తన చేతికి తిరిగొచ్చిందని రియా చక్రవర్తి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే తోటినటీనటులు కంగ్రాట్స్ చెబుతున్నారు. గత ఐదేళ్లుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో రియానే స్వయంగా చెప్పింది. వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో విషయాల్లో రాజీ పడాల్సి వచ్చిందని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. సుశాంత్ సింగ్ కేసు విచారణ సమయంలో రియాకు విదేశీ ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదు. పాస్‌‌పోర్ట్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఇన్నాళ్లకు తిరిగిచ్చేయడంతో రియా ఆనందగానికి హద్దుల్లేకుండా పోయింది.

పశ్చిమ బెంగాల్‌కి చెందిన రియా చక్రవర్తి.. 'తూనీగ తూనీగ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైంది. మొత్తంగా ఏడెనిమిది చిత్రాల్లో మాత్రమే నటించింది. ఎప్పుడైతే సుశాంత్ సింగ్ చనిపోయాడో అప్పటినుంచి ఈమెకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇప్పుడు కొంతమేర క్లియర్ కావడంతో మళ్లీ సినిమా ఛాన్సులు వస్తాయేమో చూడాలి. ప్రస్తుతానికైతే రియా చక్రవర్తి.. బిగ్‌బాస్ షోలో పాల్గొని తనని తాను నిరూపించుకోవాలని అనుకుంటోంది.

(ఇదీ చదవండి: నన్ను 'లేడీ ప్రభాస్' అని పిలుస్తుంటారు: శ్రీనిధి శెట్టి)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)