కూలీ థియేటర్లో బ్లాక్‌బస్టర్‌ ట్రైలర్‌.. దద్దరిల్లిపోయేలా అరుపులు!

Published on Thu, 08/14/2025 - 20:58

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ట్రెండ్‌సెట్ చేసిన మూవీ శివ. నాగార్జున హీరోగా రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా 1990 డిసెంబరు 7న విడుదలై కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాదాపు 35 ఏళ్ల క్రిత రిలీజైన మరోసారి మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది. అయితే సరికొత్తగా అత్యాధునిక టెక్నాలజీ హంగులతో బిగ్‌ స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఇటీవల అన్నపూర్ణ స్టూడియో 50వ వార్షికోత్సవం సందర్భంగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెలుగులో రీ–రిలీజ్‌ చేయనున్నట్లు నాగార్జున ప్రకటించారు.

అంతేకాకుండా ఇవాళ కూలీ మూవీ రిలీజ్‌ సందర్భంగా శివ 4కే ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రజినీకాంత్‌ కూలీ సినిమాకు ముందు శివ ట్రైలర్‌ రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఎగిరి గంతేశారు. థియేటర్ దద్దరిల్లిపోయేలా శివ పేరుతో మార్మోగిపోయేలా చేశారు. దీనికి సంబంధించిన వీడియోను డైరెక్టర్ ఆర్జీవీ ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్జీవీ, వెంకట్, నేను కలసి డాల్బీ ఆట్మాస్‌ సౌండ్‌తో, 4కే విజువల్స్‌తో మళ్లీ ప్రెజెంట్‌ చేస్తున్నామని నాగార్జున తెలిపారు.  

నిర్మాతలు నాపై పెట్టిన నమ్మకమే ఈ సినిమాను ఇంత ఎత్తుకు తీసుకుని వెళ్లిందని డైరెక్టర్ ఆర్జీవీ తెలిపారు. ఈ సినిమాని రీ రిలీజ్‌ చేయాలని నిర్ణయించుకోవడం నాకు థ్రిల్‌ ఇచ్చిందన్నారు. అడ్వాన్డ్స్‌ ఏఐ టెక్నాలజీతో, మోనో మిక్స్‌ను డాల్బీ అట్మాస్‌కి మార్చాం.. శివని అందరూ చూసే ఉంటారు. కానీ ఈ కొత్త సౌండ్‌తో ఎవరూ ఇంతవరకూ ఎక్స్‌పీరియన్స్‌ చేయలేదు. ఈసారి ఆ అనుభూతి గ్యారంటీ అని రామ్‌గోపాల్‌ వర్మ తెలిపారు..

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)