Breaking News

కీర్తి సురేశ్‌ అక్కలో ఈ టాలెంట్‌ కూడా ఉందా?

Published on Mon, 01/05/2026 - 07:58

కీర్తి సురేశ్‌ సౌత్‌ ఇండియాలో టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఆమె అక్క రేవతి థాంక్యూ అనే షార్ట్‌ ఫిలింకి డైరెక్టర్‌గా వ్యవహరించింది. తను భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. అలాగే ఫిలిం కోర్సు కూడా పూర్తి చేసింది. తాజాగా ఆమె వాయిద్య కళాకారిణిగా మారింది. ఈ విషయాన్ని ఆమె తల్లి, నటి మేనక సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.

తొలిసారి..
అట్టుకల్‌ దేవి అమ్మవారి గుడిలో నా కూతురు రేవతి తొలిసారి డోలు వాయించింది అంటూ వీడియో షేర్‌ చేసింది. అందులో రేవతి తెల్ల చీర కట్టుకుని, నెత్తిన పూలు పెట్టుకుని డోలును ఓ భుజానికి తగిలించుకుని తన గ్రూపుతో కలిసి వాయిస్తోంది. గతంలో రేవతిని నాట్యకళాకారిణిగా, దర్శకురాలిగా చూసిన అభిమానులు.. ఇప్పుడిలా డోలు వాయించడం చూసి తనలో ఈ టాలెంట్‌ కూడా ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు.

సినిమా
కాగా రేవతి.. దర్శకుడు ప్రియదర్శన్‌ దగ్గర కొన్నేళ్లపాటు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసింది. మరక్కర్‌, వాశి, బరోజ్‌ సినిమాల నిర్మాణంలోనూ పాలు పంచుకుంది. కీర్తి సురేశ్‌ తెరపై హీరోయిన్‌గా కనిపిస్తే, ఆమె అక్క మాత్రం తెర వెనుకే ఎక్కువ భాగమయ్యేది. వీరి తల్లి మేనక మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోయిన్‌గా అనేక సినిమాలు చేసింది. తండ్రి సురేశ్‌ కుమార్‌ నిర్మాతగా రాణించాడు.

 

 

చదవండి: రామ్‌చరణ్‌తో అనిల్‌ రావిపూడి సినిమా

Videos

సాక్షి ఫోటోగ్రాఫర్ పై తప్పుడు కేసు.. బుద్ధి చెప్పిన కోర్ట్

భయపడకు నేనున్నా.. వైఎస్ జగన్ ను కలిసిన నల్లజర్ల పోలీసు బాధితులు

తాజా రాజకీయ పరిణామాలపై నేడు వైఎస్ జగన్ ప్రెస్ మీట్

ఎన్ని ప్రాణాలు పోయినా.. ఐ డోంట్ కేర్! నాకు భూములు కావాల్సిందే!!

అడ్డగోలు దోపిడీ.. సంక్రాంతికి ట్రావెల్స్ టికెట్ బాంబు

టీడీపీ గూండాలు చేసిన అరాచకాలను వైఎస్ జగన్ కు వివరించిన బొమ్మనహాళ్ ఎంపీటీసీలు

లిఫ్ట్ ఇరిగేషన్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. ప్రెస్ మీట్ లో నోరు విప్పని చంద్రబాబు

చిరు కోసం బాబీ మాస్టర్ ప్లాన్..! అదే నిజమైతే..

ఖబర్దార్ బాబు... ఎన్ని కేసులు పెట్టినా నిలదీస్తూనే ఉంటాం....

తెలంగాణ సీఎం రేవంత్ కామెంట్స్ పై నోరువిప్పని సీఎం చంద్రబాబు

Photos

+5

రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల స్కర్ట్‌లో ఆహా అనేలా జాన్వీ కపూర్ (ఫొటోలు)

+5

సీరియల్ బ్యూటీ విష్ణుప్రియ క్యూట్ మెమొరీస్ (ఫొటోలు)

+5

మాయాబజార్ సావిత్రి లుక్‌లో యాంకర్ సుమ (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో కలిసి కరీనా కపూర్ ఫారిన్ ట్రిప్‌ (ఫొటోలు)

+5

‘కార్ల్టన్ వెల్నెస్’ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మృణాల్‌ (ఫొటోలు)

+5

తిరుమలలో హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ (ఫొటోలు)

+5

కొత్త సంవత్సరం కొత్త కొత్తగా హీరోయిన్ కృతి శెట్టి (ఫొటోలు)

+5

ఆది సాయికుమార్ ‘శంబాల’ సినిమా థ్యాంక్స్‌ మీట్‌ (ఫొటోలు)

+5

మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ (ఫొటోలు)