TDP MLA చేసిన అవమానం.. షరీఫ్ కు ముస్లిం నేతల పరామర్శ
Breaking News
రేణు దేశాయ్ సంచలన పోస్ట్.. నన్ను కాపాడటానికి ఎవరూ లేరు
Published on Tue, 01/20/2026 - 16:35
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. మరోసారి వార్తల్లో నిలిచింది. వీధి కుక్కల్ని అన్యాయంగా చంపేస్తున్నారని సోమవారం ప్రెస్ మీట్ పెట్టిన ఈమె చాలా వ్యాఖ్యలు చేసింది. ఐదు కుక్కలు కరిస్తే మిగతా వాటన్నింటినీ చంపేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తుందనే కామెంట్స్ వినిపించాయి. దీనిపైనా స్పందిస్తూ తనకు రాజకీయాలు ఇష్టం లేదని, ఏ పార్టీలోకి వెళ్లడం లేదని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఏకంగా తను ఒంటరి, ఎవరూ లేరని సంచలన పోస్ట్ పెట్టింది.
(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాకు రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్)
'నన్ను కాపాడటానికి అమ్మనాన్న, అన్నయ్య, భర్త.. ఎవరూ లేరు. తాజా అంశంపై నా తప్పు లేకపోయినా సరే ఎందరో నన్ను విమర్శిస్తున్నారు. మీరు చేసే కామెంట్స్‌పై తిరిగి స్పందించను. నేను నమ్మే భగవంతుడి దగ్గర మాత్రమే నా బాధ చెబుతాను. ఆయన నా ప్రార్థనలు వింటున్నాడనే నమ్మకం నాకు ఉంది. నేను ఎప్పటికప్పుడు కాశీకి ఎందుకు వెళ్తానో మీకు ఇప్పడు అర్థమైంటుంది' అని రేణు దేశాయ్ రాసుకొచ్చింది. ఈ మేరకు కాశీలోని గంగ నదిలో బోటులో ఉన్న వీడియోని షేర్ చేసింది.
ఇదే పోస్టులో వీధి కుక్కలని చంపే విషయమై తన పోరాటం గురించి మరోసారి ప్రస్తావించింది. 'నేను ఎప్పుడూ నా హక్కుల కోసం పోరాడలేదు. వీధి కుక్కల విషయంలో మాత్రం పోరాటం ఆపను. కొన్ని కుక్కలు చేసిన తప్పునకు వందలాది వాటిని చంపాలనే నిర్ణయం సరైనది కాదు. ఇది మీకు అర్థమయ్యేంతవరకు పోరాడుతూనే ఉంటాను' అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: కూరగాయలు తింటే జీర్ణం కావు.. స్టార్ హీరోకి వింత సమస్య!)
Tags : 1