Breaking News

కొందరు అనుకోకుండా మన జీవితంలోకి వస్తారు: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

Published on Mon, 04/03/2023 - 21:20

నటి, దర్శకురాలు రేణు దేశాయ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 2012లో పవన్‌ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్న రేణు దేశాయ్‌ అప్పటి నుంచి తన కుమారుడు అకీరా నందన్‌తో పాటే ఉంటోంది.  రేణూ దేశాయ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన భావాలను వ్యక్తం చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ వీడియోను షేర్ చేస్తూ తన మనసులోని భావాలను వ్యక్తం చేసింది.

రేణు తన ఇన్‌స్టాలో రాస్తూ..' కొంతమంది మీ జీవితంలోకి అనుకోకుండా వస్తారు.  వేసవి రోజుల్లో చల్లని వసంత గాలిలా.. వారి చూపులతోనే నేరుగా మీ హృదయంతో మాట్లాడతారు. అదోక రహస్యమైన భాష. మీరు వారితో కొన్ని గంటలు గడిపినప్పటికీ.. వారి ప్రభావం మీపై శాశ్వతంగా ఉంటుంది.. కానీ వాటిలో చాలా వరకు బాధాకరమైనవి కూడా ఉండొచ్చు. కానీ కొందరు మాత్రమే మీ జీవితాన్ని పరిపూర్ణం చేస్తారు. మీ కన్నీళ్లను తుడిచి.. కాంతిని పంచుతారు.  అలాగే మిమ్మల్ని నవ్విస్తారు కూడా.' అంటూ పోస్ట్ చేసింది. అయితే ప్రస్తుతం రేణు దేశాయ్ తన కుమారుడు అకీరా నందన్‌ కోసం ఫారిన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఫ్లైట్‌లో తన కుమారుడితో ఉన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు. కాగా.. గతంలో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)