Breaking News

సౌందర్య చనిపోతుందని ఆమె తండ్రికి ముందే తెలుసా?

Published on Mon, 04/17/2023 - 19:59

హీరోయిన్‌ సౌందర్య.. తెలుగు సినీ పరిశ్రమలో ఈమె పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ కొందరు మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి సౌందర్య కూడా ఒకరు. మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సౌందర్య తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ గుర్తిండిపోతుంది.

చక్కటి చీరకట్టులో, నిండైన రూపంతో పదహారణాల తెలుగింటి అమ్మాయిలా నటించి ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. గ్లామర్‌ షో చేయకుండానే చీరకట్టులోనే కనిపించి అగ్రకథానాయిగా చక్రం తిప్పిన సౌందర్య అనుకోని ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.ఆమె మరణించి 19 ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ ఆమె రూపం అభిమానుల గుండెల్లో చిరస్మరణీయంగానే ఉంది.

నిజానికి సౌందర్యను డాక్టార్‌ను చేయాలని ఆమె తండ్రి కలలు కన్నాడట. కానీ కూతురి జాతకంలో సినీ నటి అవుతుందని ఉందట. ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే ఇండస్ట్రీ నుంచి పిలుపు రావడంతో డాక్టర్‌ కావాల్సిన సౌందర్య నటిగా అరంగేట్రం చేసింది. ఇక సౌందర్య తండ్రి సజాత్యనారాయణకు జాతకలపై మంచి పట్టు ఉండేదట.

తఓ సందర్భంలో ఓ డైరెక్టర్‌ చిట్టిబాబుతో మాట్లాడుతున్న ఆయన.. సౌందర్య గురించి మాట్లాడుతూ.. నా కూతురి జాతకం ప్రకారం.. ఆమె దక్షణాదిలో టాప్‌ హీరోలందరితో పనిచేసిన అగ్రనటిగా సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుంటుంది. కానీ 2004లో ఆమె సినీ కెరీర్‌ ముగుస్తుంది అని చెప్పాడట. అయితే ఆ మాటలు విని బహుశా పెళ్లి చేసుకొని కాస్త గ్యాప్‌ తీసుకుంటుందేమో అనుకున్నాం..కానీ ఇలా జీవితమే ముగుస్తుందని ఊహించలేదు అంటూ చిట్టిబాబు అప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)