Breaking News

పెళ్లి వేడుకలో ప్రభాస్ సిస్టర్స్.. రెబల్ స్టార్‌ మ్యారేజ్‌పై మొదలైన చర్చ!

Published on Tue, 02/11/2025 - 19:24

టాలీవుడ్‌ హీరోల్లో ఎవరి పెళ్లి కోసమైనా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటే అది ఆయన ఒక్కరిదే. ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోలు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. గతేడాదిలోనే నాగచైతన్య ఓ ఇంటివాడయ్యారు. అంతేకాకుండా ఈ ఏడాదిలోనే అఖిల్ అక్కినేని సైతం పెళ్లి చేసుకోబోతున్నారు. అలా దాదాపు మన హీరోలంతా పెళ్లిళ్లు చేసుకుని వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

ప్రభాస్ పెళ్లి కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు..

కానీ టాలీవుడ్ ఫ్యాన్స్‌కు ఇప్పటి వరకు తీరని కోరిక ఏదైనా ఉందంటే అది మన రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి వేడుకే. ప్రభాస్ పెళ్లి కోసం ఆయన ఫ్యామిలీ కంటే.. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే టాలీవుడ్‌లో ఏదో ఒక సందర్భంలో ఈ టాపిక్‌ గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది. అలానే తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి మరోసారి చర్చ మొదలైంది.

అందుకు కారణం ప్రభాస్ బంధువుల పెళ్లిలో ఆయన ముగ్గురు చెల్లెల్లతో పాటు కృష్ణంరాజు భార్య శ్యామల దేవి కనిపించారు. పెళ్లిలో వారంతా కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా షేర్ చేశారు. ఇంకేముంది ప్రభాస్ అన్న పెళ్లి ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 

prabhas

ఇటీవల జరిగిన బంధువుల పెళ్లికి కృష్ణంరాజు భార్య శ్యామల దేవి హాజరయ్యారు. ఆమెతో పాటు ముగ్గురు కుమార్తెలు(ప్రభాస్ చెల్లెళ్లు) ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి కూడా ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. అందరూ కలిసి దిగిన ఫోటోలను ప్రసీద్ ఉప్పలపాటి తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఇవీ చూసిన అభిమానులు ప్రభాస్ అన్నకు త్వరగా పెళ్లి చేయండి సిస్టర్స్ అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ప్రసీద తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను చూసుకుంటున్నారు. మిగిలిన ఇద్దరు సిస్టర్స్ మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు.

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)