Breaking News

'కూలీ' చేశా.. చాలా డిసప్పాయింట్ అయ్యా: రెబా

Published on Wed, 09/24/2025 - 17:30

సూపర్‪‌స్టార్ రజనీకాంత్.. గత నెలలో 'కూలీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. విడుదలకు ముందు బీభత్సమైన అంచనాలు ఉండగా.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత చాలా నిరాశపరిచింది. కథకథనం ఏ మాత్రం కొత్తదనం లేకపోవడంతో చాలామంది అసంతృ‍ప్తి వ్యక్తం చేశారు.  అతిథి పాత్ర చేసిన ఆమిర్ ఖాన్ కూడా ఇందులో నటించానని తప్పు చేశానని అన్నట్లు రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ మూవీలో నటించిన హీరోయిన్ రెబా మోనికా కూడా చాలా అప్‌సెట్ అయ్యానని బహిరంగంగానే చెప్పింది.

తెలుగులో సామజవరగమన, మ్యాడ్ స్క్వేర్, సింగిల్ తదితర చిత్రాల్లో నటించిన రెబా మోనికా జాన్.. తమిళ, మలయాళంలోనూ హీరోయిన్‪‌గా మూవీస్ చేస్తోంది. 'కూలీ'లో శ్రుతి హాసన్ చెల్లి పాత్రలో ఈమె నటించింది. సినిమా మొత్తంలో ఈమెవి మూడు నాలుగు సీన్లు మాత్రమే ఉంటాయి. డైలాగ్స్ ఏం ఉండవు. తాజాగా ఇన్ స్టాలో ఫాలోవర్స్‌తో ముచ్చటించిన ఈమె.. 'కూలీ'లో నటించడంపై ఇప్పుడు స్పందించింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి అనుష్క ‘ఘాటీ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?)

'చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను. నా పాత్రని ఇంకాస్త బాగా చూపించి ఉండొచ్చు. కానీ పరిస్థితులు కుదరక అనుకున్నది జరగలేదు. కానీ తలైవర్ రజనీకాంత్‌తో కలిసి నటించినందుకు చాలా ఆనందంగా ఉన్నాను' అని ఓపెన్‌గానే రెబా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.

రెబా మాత్రమే కాదు 'కూలీ'లో ఉపేంద్ర పాత్రకు కూడా పరిమిత స్క్రీన్ స్పేస్ ఉంటుంది. ఆమిర్ ఖాన్ పాత్ర కూడా తేలిపోయింది. నాగార్జున పాత్రని కూడా ప్రారంభంలో బాగానే చూపించారు కానీ ముగింపు సరిగా ఇవ్వలేదు. ఈ సినిమా వచ్చిన తర్వాత దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌పైనా చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ ట్రోలింగ్ జరుగుతూనే ఉంది.

(ఇదీ చదవండి: నేను ఇప్పుడు ఇలా.. అల్లు అర్జున్ దీనికి కారణం: తమన్నా)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)