Breaking News

‘RC17’ పై అంచనాలు పెంచేస్తున్న సుకుమార్‌ భార్య

Published on Sun, 11/01/2026 - 15:38

మెగాహీరో రామ్ చరణ్ కొత్త సినిమా ఎట్టకేలకు లాంచ్ అయింది.  ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఆదివారం (నవంబర్ 01న) హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. చిరంజీవి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రామ్ చరణ్, సుకుమార్‌తో పాటు నిర్మాతలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలానే దిల్ రాజు, హరీశ్ శంకర్, బుచ్చిబాబు, మారుతి తదితరులు కూడా ఈ ఈవెంట్‌లో సందడి చేశారు.

కాగా గతంలో సుకుమార్‌, రామ్‌ చరణ్‌ కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సుకుమార్‌ సతీమణి తబితా సుకుమార్‌ చేసిన పోస్ట్‌ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.  

(ఇదీ చదవండి: ఆర్‌ సీ17.. ఆశలన్నీ సుకుమార్‌పైనే!)

సుకుమార్ భార్యగా ఎంతగానో.. 
‘ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుకుమార్ భార్యగా తనకు ఎంతగానో ఎగ్జైట్‌మెంట్ ఇస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం సుకుమార్ పడ్డ కష్టం కళ్లారా చూశాను. ఇప్పుడు ఇలా మొదలుకావడం చాలా స్పెషల్ గా అనిపిస్తోంది. ప్రేక్షకులు లాగే నేను కూడా ఈ సినిమా కోసం ఎంతో ఎదురుచూస్తున్నా’ అని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.ఇప్పుడీ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

 అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ రవిచందర్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సుకుమార్‌ గత చిత్రాలకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్‌ కాకుండా ఈసారి అనిరుధ్‌ బాధ్యతలు చేపట్టనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

(ఇదీ చదవండి: 400 మంది కష్టాన్ని ట్రోల్స్‌ చేయద్దు : స్టార్‌ డైరెక్టర్‌)

 

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)