TVK లీడర్ గా చెబుతున్నా..పొలిటికల్ గా వైఎస్ జగనే విజయకు స్ఫూర్తి
Breaking News
ఆర్బీ చౌదరి అంత్యక్రియలకు చెన్నైలో ఏర్పాట్లు
Published on Wed, 05/06/2026 - 10:10
90కి పైగా సినిమాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి.. రాజస్థాన్లోని ఉదయ్పుర్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. దీంతో తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం విశాల్ హీరోగా ఈయన నిర్మాతగా 99వ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే 100వ మూవీపై ప్రకటన చేయాలనుకున్నారు. ఇంతలోనే ఇలా జరగడంతో విషాదం నెలకొంది.
(ఇదీ చదవండి: ఆర్బీ చౌదరి.. రాజస్థాన్ టూ సౌత్ ఇండస్ట్రీ.. ప్రస్థానం ఇలా..!)
ఇకపోతే నేడు(మే 06) ఆర్బీ చౌదరి భౌతికకాయాన్ని చెన్నైకి మధ్యాహ్నం 3 గంటలకు తీసుకురానున్నారు. మైలాపుర్లో ఉన్న ఆయన నివాసంలో అభిమానులు, చిత్ర పరిశ్రమ సభ్యులు, స్నేహితుల సందర్శనార్థం తుది నివాళి అర్పించేందుకు ఉంచనున్నారు. గురువారం చెన్నైలో ఈయనకు అంత్యక్రియలు చేయబోతున్నారు.
(ఇదీ చదవండి: తండ్రి మరణం.. వెక్కి వెక్కి ఏడ్చిన హీరో జీవా(వీడియో))
Tags : 1