కడప స్టీల్ పై బాబు నాటకం
Breaking News
శ్రీరామనవమి స్పెషల్.. ఇరుముడి టీమ్ ప్రత్యేక పోస్టర్
Published on Thu, 03/26/2026 - 17:47
రవితేజ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఇరుముడి. ఈ చిత్రంలో మాస్ మహారాజా అయ్యప్పదీక్షలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ చూస్తే డెవోషనల్ టచ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రీ, కూతుళ్ల బంధం నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు.
తాజాగా ఇరుముడి టీమ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రేమ, ఆప్యాయత గల తండ్రి.. ముచ్చటైన కూతురి కథ.. అంటూ మైత్రి మూవీ మేకర్స్ పోస్ట్ చేసింది. ఈ పోస్టర్‌తోనే కథేంటో మేకర్స్ రివీల్ చేశారు. ఈ ఏడాది రవితేజ బర్త్ డే సందర్భందా మూవీ టైటిల్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏడాదిలోనే విడుదల కానుంది.
Tale of a Doting father & Lovely daughter knotted with love - #IRUMUDI 🫶
శ్రీరామనవమి శుభాకాంక్షలు 🏹✨
Starring MASS MAHARAJA @RaviTeja_offl
A @gvprakash musical 🎺🎼@priya_Bshankar @ShivaNirvana @MythriOfficial @saikumaractor #BabyNakshathra #VishnuSharma @sahisuresh… pic.twitter.com/CNZuTYRLKB— Mythri Movie Makers (@MythriOfficial) March 26, 2026
Tags : 1