Breaking News

రవితేజకు 26 ఎకరాల తోట.. ఇప్పుడు వందల కోట్ల విలువ!

Published on Mon, 08/17/2026 - 10:58

టాలీవుడ్‌లో పలువురు హీరోలు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బంతా భూములు, ఇతర స్థిరాస్తులపై పెట్టుబడిగా పెడుతుంటారు. ఈ జాబితాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం ఆయన శంకర్‌పల్లి సమీపంలో 26 ఎకరాల తోటను కేవలం రూ.12 లక్షలకు కొనుగోలు చేసినట్లు నటుడు అజయ్ ఘోష్ తెలిపారు. ప్రస్తుతం ఆ భూమి విలువ వందల కోట్లకు చేరిందని ఆయన చెప్పడం ఆసక్తికరంగా మారింది.

రవితేజ, అజయ్ ఘోష్ కలిసి నటించిన ‘మాస్ జాతర’ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ కోసం శంకర్‌పల్లి సమీపంలోని 26 ఎకరాల తోటలో రైల్వే స్టేషన్, ఇల్లు తదితర సెట్లు ఏర్పాటు చేసినట్లు అజయ్ ఘోష్ వెల్లడించారు. ఆ తోట రవితేజకు చెందినదేనని చెప్పారు.

(చదవండి: నిజంలో బతకడం రవితేజకే చెల్లింది.. అజయ్‌ ఘోష్‌)

‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. “నేను, రవితేజ కలిసి ‘మాస్ జాతర’ సినిమా చేశాం. ఆ సినిమాకు రైల్వే స్టేషన్ సెట్, ఇల్లు సెట్‌ను ఒక తోటలో వేశారు. శంకర్‌పల్లి దగ్గర ఉన్న 26 ఎకరాల తోట అది. ఆ తోట రవితేజ గారిదే. ఎప్పుడో దాన్ని రూ.12 లక్షలకు కొన్నారు. ఇప్పుడు దాని విలువ వందల కోట్లు ఉంది” అని తెలిపారు.

అదే సమయంలో సెట్‌లో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటనను కూడా అజయ్ ఘోష్ గుర్తుచేసుకున్నారు. ఆ తోట విలువ గురించి తెలుసుకున్న ఓ వ్యక్తి ఆశ్చర్యపోయి.. ‘ఈ తోట అన్ని కోట్ల విలువ చేస్తుందని అంట కదా?” అని రవితేజను అడిగారట. అందుకు రవితేజ స్పందిస్తూ.. ‘ఇవన్నీ ఇక్కడే ఉంటాయి.. మనం పోతాం. ఇవన్నీ ఉన్నాయని సంతోషించాలి. కానీ మనం పని చేసుకోవాలి’ అని చెప్పినట్లు అజయ్ ఘోష్ వెల్లడించారు. రవితేజ ఆస్తులపై అజయ్ ఘోష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. 

Videos

విశాఖ MP భరత్ కు బిగ్ షాక్ ఏకమైన ఎమ్మెల్యేలు

AP అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. YSRCP ఎమ్మెల్సీల ర్యాలీ

మాస్ మహారాజా చిక్కుల్లో!

అమరావతిలో సదుపాయాలు లేవు.. కూటమి పార్టీ MLA షాకింగ్ కామెంట్స్

చింతాడ రవి కుమార్ సంచల ప్రెస్ మీట్

టీచర్ల విషయంలో డబుల్ రూల్స్ ఎందుకు? లోకేష్ తీరుపై ఉపాధ్యాయ సంఘాల ఫైర్

Telangana SIR: 90 లక్షల మందికి నోటీసులు -CEO సుదర్శన్ రెడ్డి

పిఠాపురంలో TDPకి బిగ్ స్ట్రోక్..!

భారత్ ఎన్నికలపై ట్రంప్ ఫోకస్..! అమెరికాలో కొత్త రూల్స్ కు పిలుపు

రేవంత్ పై కోపమా అక్కా.. CM టూర్ లో మంత్రి మిస్సింగ్

Photos

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు)

+5

18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు)

+5

న్యూయార్క్‌ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు)

+5

కందుకూరులో వైభవంగా తేళ్ల పంచమి... పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : కన్నుల పండువగా ఇస్కాన్‌ దేవాలయ స్వర్ణోత్సవాలు (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా సందడి (ఫొటోలు)

+5

చిరునవ్వులు చిందిస్తూ శ్రియా సోయగాలు (ఫొటోలు)

+5

వయ్యారాలు ఒలకబోస్తున్న రకుల్‌ (ఫొటోలు)

+5

‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

బండ్ల గణేశ్‌ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)