Breaking News

రవితేజ మాస్ జాతర.. బాహుబలి దెబ్బతో వరస్ట్ రికార్డ్!

Published on Fri, 10/31/2025 - 16:35

మాస్ మహారాజా తాజాగా మరో యాక్షన్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తోన్న మాస్ జాతర ప్రీమియర్స్ ఈ రోజు నుంచే థియేటర్లలో సందడి చేయనున్నాయి. అక్టోబర్ 31 రిలీజవుతుందని ప్రకటించినా మేకర్స్.. బాహుబలి ది ఎపిక్ దెబ్బకు ప్రీమియర్స్‌కే పరిమితయ్యారు. దీంతో మాస్ జాతర ఫస్ట్ ‍డే కలెక్షన్స్‌పై ఎఫెక్ట్‌ పడింది. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే రూ.61 లక్షలకే పరిమితమైంది. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కావడతో మాస్ జాతరకు ఆశించిన స్థాయిలో వసూళ్లు వచ్చేలా కనిపించడం లేదు.

బాక్సాఫీస్ వద్ద బాహుబలి ది ఎపిక్ మూవీతో మాస్ జాతరకు గట్టి పోటీ ఎదురవుతోంది. ప్రముఖ ట్రేడింగ్ వెబ్‌ సైట్‌‌ సాక్నిల్క్ ప్రకారం అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటివరకు రూ. కోటి కూడా దాటలేదు. అడ్వాన్స్‌ బుకింగ్స్‌తో శుక్రవారం మధ్యాహ్నం వరకు కేవలం రూ.61 లక్షలు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రీమియర్స్‌ సాయంత్రం రిలీజ్‌ చేయడం.. తక్కువ షోలు వేయడం కూడా వసూళ్లపై ప్రభావం పడిందని చెప్పొచ్చు. ఉదయమే ప్రీమియర్స్‌తో పాటే మూవీ రిలీజ్‌ అయి ఉంటే వసూళ్ల పరంగా మాస్ జాతరకు కలిసొచ్చేది.

ఓవరాల్‌గా చూస్తే శుక్రవారం ప్రీమియర్స్‌తో కలిపి రూ.2 నుంచి 3 కోట్ల వరకు వసూళ్లు సాధించవచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. గతేడాది రిలీజైన రవితేజ మిస్టర్‌ బచ్చన్‌ మూవీ వసూళ్ల కంటే తక్కువే. ఈ సినిమా తొలి రోజే రూ.3.45 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోవడంతో రవితేజ కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచింది. వీకెండ్‌లో మాస్ జాతర రిలీజ్ కావడం నిర్మాతకు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన శని, ఆది వారాల్లోనైనా మాస్ జాతర వసూళ్లు పుంజుకునే అవకాశముంది. కాగా.. మాస్ జాతరలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)