Breaking News

రవితేజ తమ్ముడి కుమారుడి సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?

Published on Wed, 07/22/2026 - 22:10

మహారాజా రవి తేజ తమ్ముడి కొడుకు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న మూవీ మారెమ్మ. ఈ చిత్రంతోనే మాధవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.  ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి టీజర్‌ రిలీజ్‌ చేయగా అభిమానులను ఆకట్టుకుంది.  ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్‌గా కనిపించనున్నారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్‌ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. మారెమ్మ చిత్రం రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. ఈ ఏడాది వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ పంచుకున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో తెరకెక్కిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ సినిమాలో వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు.
 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)