Breaking News

రష్మిక కోసం సుకుమార్ సెంటిమెంట్ బ్రేక్?

Published on Tue, 07/21/2026 - 15:22

ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఈ సినిమాల్లో హీరోయిన్లు ఎవరా అని చూస్తే రష్మిక లాంటి ఒకరిద్దరు సౌత్ హీరోయిన్లు, లేదంటే బాలీవుడ్ భామలే కనిపిస్తారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా పెళ్లి చేసుకుని రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మికని మరో బంపర్ ఆఫర్ వరించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)

'పుష్ప' తర్వాత సుకుమార్.. రామ్ చరణ్‌తో సినిమా చేయబోతున్నాడు. చాన్నాళ్ల క్రితమే మూవీ లాక్ అయింది. రీసెంట్‌గా 'పెద్ది'తో వచ్చిన చరణ్ ఖాళీ అయిపోయాడు. మరోవైపు సుక్కు చరణ్‌తో తీయబోయే మూవీ పనిలో  ఉన్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, ప్రస్తుతం మిగతా పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగానే హీరోయిన్‌గా రష్మికని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సుకుమార్ ఇప్పటివరకు చాలానే సినిమాలు చేశాడు గానీ ఒకసారి పనిచేసిన హీరోయిన్‌తో మళ్లీ పనిచేయలేదు. 'పుష్ప' రెండు భాగాలు అయినప్పటికీ అది ఒక ప్రాజెక్ట్ కిందకే వస్తుంది. ఒకవేళ ఇప్పుడు చరణ్ సరసన రష్మికని తీసుకుంటే సుక్కు సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది. అదే టైంల చరణ్-రష్మికది కూడా ఫ్రెష్ కాంబో కాబట్టి. ప్రేక్షకుల్లోనూ కాస్త ఆసక్తి పెరిగే అవకాశముంటుంది.

సుకుమార్ సినిమా అంటే కచ్చితంగా ఏళ్లకు ఏళ్లు పడుతుంది. 'పుష్ప' రెండు భాగాలు తీయడానికి ఐదేళ్లు పట్టేసింది. మరి ఇప్పుడు రామ్ చరణ్‌తో కనీసంలో కనీసం రెండేళ్లయినా పట్టొచ్చు. అంటే ఎంతలేదన్నా మూవీ వచ్చేసరికి 2028 చివర అయిపోవచ్చు. మరి రష్మిక విషయంలో వస్తున్న రూమర్స్ నిజమా కాదా అనేది రాబోయే రోజుల్లో క్లారిటీ రావొచ్చు.

(ఇదీ చదవండి: విలేజ్ స్టైల్లో మెగాహీరో మాస్ పాట)

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)