Breaking News

కొత్తగా బిజినెస్ మొదలుపెట్టిన రష్మిక

Published on Mon, 07/21/2025 - 12:23

చాలామంది చేతిలో డబ్బులున్నాయా కదా అని ఖర్చు పెట్టేస్తుంటారు. అయితే చేతిలో పైసా ఉన్నప్పుడు దాన్ని ఆదా చేయాలి, లేదంటే ఎక్కడైనా పెట్టుబడిగా పెట్టుకోవాలి అనేది ఇప్పటి ట్రెండ్. దీన్ని చాలామంది హీరోయిన్లు కూడా పాటించేస్తున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్‌లు మొదలుపెట్టేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం నయనతార, సమంత లాంటి స్టార్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు రష్మిక కూడా ఆ రూట్‌లోకి వచ్చేసింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు)

గత రెండు మూడు రోజుల నుంచి ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నానని ఊరిస్తూ వచ్చిన రష్మిక.. ఇప్పుడు ఆ విషయమేంటో బయటపెట్టింది. 'డియర్ డైరీ' పేరుతో ఓ ఫెర్ఫ్యూమ్ బ్రాండ్‌ని లాంచ్ చేసింది. ఇది ఓ బ్రాండో లేదంటే ఫెర్ఫ్యూమో కాదని.. ఇది తనలో ఓ భాగమని చెప్పుకొచ్చింది. ఈ బిజినెస్ విషయంలో అందరి సపోర్ట్ కావాలని చెప్పుకొచ్చింది. ఈ ఫెర్ఫ్యూమ్ ధరల విషయానికొస్తే రూ.1600, రూ.2600 రేంజులో ఉన్నాయి.

యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర.. ఇలా వరస బ్లాక్‌బస్టర్స్ కొట్టిన రష్మిక.. హీరోయిన్‌గా సూపర్‌ ఫామ్‪‌లో ఉంది. మరి బిజినెస్ ఉమన్‪‌గా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి? మరోవైపు హీరో విజయ్ దేవరకొండతో ఈమె రిలేషన్‌లో ఉన్నట్లు చాన్నాళ్లుగా రూమర్స్ వస్తున్నాయి. అందుకు తగ్గట్లే అప్పుడప్పుడు ఫొటోలు బయటకొస్తుంటాయి. మరి వీళ్లు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా? అని అభిమానులు కూడా కాస్త ఆత్రుతగానే ఎదురుచూస్తున్నారు. మరి ఈ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారో చూడాలి?

(ఇదీ చదవండి: చరణ్ 'పెద్ది'.. ఈ రేంజులో మారిపోయాడేంటి?)

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)