Breaking News

రష్మిక మందన్నా లవ్‌ లెటర్‌.. నెట్టింట వైరల్‌

Published on Fri, 11/07/2025 - 11:50

ది గర్ల్‌ఫ్రెండ్‌ సినిమా (The Girlfriend Movie)లో నటనకు రష్మిక మందన్నా (Rashmika Mandanna)కు జాతీయ అవార్డు రావాల్సిందే! నిన్నటివరకు ఇది అల్లు అరవింద్‌ మాట.. కానీ, ఈ సినిమా చూశాక చాలామందిదీ ఇదే మాట! రష్మికకు అవార్డు ఇచ్చి తీరాల్సిందే.. అంత అద్భుతంగా నటించింది అని కొనియాడుతున్నారు. రష్మిక మందన్నా, దీక్షిత్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన మూవీ ది గర్ల్‌ఫ్రెండ్‌. 

మీ అందరికీ నా ప్రేమలేఖ
రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ నేడు (నవంబర్‌ 7న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా రష్మిక సోషల్‌ మీడియా వేదికగా ఓ లవ్‌ లెటర్‌ రాసింది. అమ్మాయిలందరికీ దాన్ని అంకితమిచ్చింది. అందులో ఏముందంటే.. స్త్రీగా ఎదుగుతున్న అమ్మాయిలందరికీ నా ప్రేమలేఖ.. 'నీకేం తెలుసు?' అన్న ప్రశ్న ఎదుర్కొనే ప్రతి అమ్మాయి 'తనకేం కావాలో బాగా తెలుసు' అనే స్థాయికి చేరుకుంటుంది. ఈ జర్నీ చిన్నదేమీ కాదు. 

ప్రేమ అంటే బంధీ అవడం కాదు
నువ్వు ఎంతోదూరం వచ్చావ్‌.. ఇప్పటికైనా నిన్ను నువ్వు ప్రేమించు, నిన్ను చూసి నువ్వు గర్వపడు. ఇలాంటి అమ్మాయిలకు అండగా నిలబడిన అబ్బాయిలు.. మీ ప్రేమ వల్లే తాను ఇంత ధైర్యంగా నిలబడగలిగింది. ప్రేమలో ఎవరూ మాట్లాడని విషయాల గురించి ఈ సినిమా చర్చిస్తుంది. ప్రేమ అంటే హద్దులు గీసుకుని బంధీ అవడం కాదు, స్వేచ్ఛగా జీవించడం.. ఎన్ని గాయాలైనా సరే.. మనసును తేలిక చేసుకుని ధైర్యంగా ముందుకు సాగడం. 

మిమ్మల్ని మీరు ప్రేమించండి
నా ప్రాణం పెట్టి ఈ సినిమా చేశాను. ఈ సినిమా మీ మనసును తాకుతుందని, మీ బలాన్ని మీకు గుర్తు చేస్తుందని ఆశిస్తున్నాను. మిమ్మల్ని మీరు ప్రేమిస్తారని అనుకుంటున్నాను. అదే గనక నిజమైతే నా ఆశయం నెరవేరినట్లే! నిశ్శబ్ధాన్ని చీల్చుకుని ధృడసంకల్పంతో ముందడుగు వేసేవారికి.. వారిని వెన్ను తట్టి ప్రోత్సహించే వారికోసమే నా ఈ ప్రేమలేఖ అని ట్వీట్‌ చేసింది. ఈ లవ్‌ లెటర్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 

 

చదవండి: The Girlfriend: రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీ రివ్యూ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)