ఆమె పదేళ్ల చిన్నారి.. ఎలా పెంచుతున్నానంటే: రష్మిక

Published on Fri, 02/28/2025 - 15:11

రష్మిక మందన్న(Rashmika Mandanna ) ఓ ఏడాది క్రితం అయితే ఏమోగాని...ఇప్పుడు ఆమె ఇంటర్నేషనల్‌ స్టార్‌. పుష్ప, పుష్ప 2లతోనే అమాంతం అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆమెను ఆ వెంటనే వచ్చిన చావా ఎక్కడికో తీసుకెళ్లిపోయింది.

ప్రస్తుతం తన తాజా చిత్రం ఛావా విజయాన్ని ఎంజాయ్‌ చేస్తోన్న రష్మిక త్వరలోనే విడుదల కానున్న  సికిందర్‌ లో సల్మాన్‌ఖాన్‌ సరసన నటించింది. ఈ సినిమా మీద కూడా బాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపధ్యంలో రష్మిక ఇటీవల మరో బాలీవుడ్‌ సీనియర్‌ నటి నేహా ధూపియాతో ‘‘నేహాతో నో ఫిల్టర్‌’’ షోలో తన కుటుంబం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

అమ్మానాన్న ఇన్వాల్వ్‌ కారు...భారం నాదే...
స్టార్‌ హీరోయిన్‌ గా ఎదిగినా ఇప్పటికీ రష్మిక నిరాడంబరంగా కనిపిస్తుంది. వీలైనంత వరకూ డౌన్‌ టూ  ఎర్త్‌ ఉంటుంది. ఈ పరిణితికి కారణం ఏమిటి? అంటే... ఆమె తన  తల్లిదండ్రుల పెంపకమే అని స్పష్టం చేస్తుంది. ‘‘ ఇది నీ జీవితం  నీ జీవితంలో  జోక్యం చేసుకోమని మమ్మల్ని అడగకు ’’ అని నా తల్లిదండ్రులు భారాన్ని  తీసుకొచ్చి నా తలపై ఉంచారు కాబట్టి, ‘ అని ఆమె వివరించింది.  తన  పేరు ప్రఖ్యాతులు ఎంతగా పెరుగుతున్నప్పటికీ తన తల్లిదండ్రులు ఎల్లప్పుడూ నిరాడంబరమైన, స్వతంత్ర జీవితాన్ని  జీవిస్తున్నారని చెప్పింది.

చెల్లి...పదహారేళ్ల వ్యత్యాసం...
రష్మిక మందన్నకు ఓ సోదరి ఉంది. ఈ ఇంటర్వూలో తన చెల్లెలు గురించి రష్మిక కొన్ని  ఆశ్చర్యకరమైన వివరాలను పంచుకుంది, అందులో ముఖ్యమైనది తనకు తన చెల్లికి  మధ్య 16 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉండడం. ‘నాకు 10 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక చెల్లెలు ఉంది,  మా మధ్య దాదాపు 16 సంవత్సరాల గ్యాప్‌ ఉంది‘ అని రష్మిక ఆ సంభాషణలో వెల్లడించారు.

 రష్మిక ఎప్పుడూ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటుంది. ఆ స్వేఛ్చకు ఆమె సెలబ్రిటీ హోదా కూడా అడ్డం కాకూడదని ఆశిస్తుంది.  ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించడం  కోసం, వీలైనంత వరకూ సాదా సీదాగా సాధారణ స్థితిని కొనసాగించడం కోసమే  ప్రాధాన్యతనిస్తుంది,తన తల్లిదండ్రుల పెంపకాన్ని రష్మిక అభినందిస్తుంది.  తన పెంపకం ఓ వ్యక్తిగా తనని ఎలా తీర్చిదిద్దిందో  తన సోదరి కూడా అలాగే ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు వివరించింది.

 ‘నేను ఎప్పుడూ నా చెల్లి విషయంలో ఆలోచించేది ఒకటే, నాకున్న ఇప్పటి పరిస్థితుల వల్ల ఆమె కోరుకున్నది ఏదైనా ఆమె  పొందుతుంది. కానీ అది ముఖ్యం కాదు, ఎందుకంటే నేను పెరిగిన పెంపకం లాంటిదే ఆమెకు మంచిది. దాని కారణంగానే నేను ఈ రోజు ఇలా ఉన్నాను,‘ అని ఆమె చెప్పింది, బాల్యం నుంచే ప్రతీ వ్యక్తీ స్వతంత్రంగా ఎదగాల్సిన అవసరం ఉందనేది ఆమె అభిప్రాయం.

‘అయితే, ప్రస్తుతం, ఆమె చిన్న పిల్ల. తర్వాత తర్వాత నేను ఆమెకు ఇవ్వాల్సిన భద్రత చాలా ఉంది, వయసుతో పాటు ఆమెకు నేను అందించగలిగిన సౌకర్యాలు కూడా చాలా ఉన్నాయి’’ అంటూ చెల్లి పట్ల తనకున్న అపారమైన ప్రేమను రష్మిక పంచుకుంది. ,  భవిష్యత్తులో తన సోదరికి రక్షణ  సౌకర్యవంతమైన జీవితాన్ని అందించడంతో పాటు  లేత వయస్సులో సరైన  పెంపకాన్ని అందించడం చాలా అవసరమని అంటున్న రష్మిక అభిప్రాయాలకు దోహదం చేసింది స్వీయానుభవాలే.

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)