Breaking News

రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్‌.. మరో క్రేజీ రికార్డ్..!

Published on Wed, 12/17/2025 - 17:20

రష్మిక ప్రధాన పాత్రలో వచ్చిన లేటేస్ట్ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్‌. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌ నిలిచింది. దీక్షిత్‌ శెట్టి కీలక పాత్రలో నటించిన ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా రూ.28 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే కేవలం మౌత్‌ టాక్‌తోనే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది.

ప్రస్తుతం ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన నాన్-ఇంగ్లీష్ చిత్రాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సింగర్ చిన్మయి శ్రీపాద ట్వీట్ చేసింది. ది గర్ల్‌ఫ్రెండ్ పోస్టర్‌ను షేర్ చేసింది. కాగా.. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు.

ది గర్ల్‌ఫ్రెండ్‌ కథేంటంటే?

భూమా (రష్మిక మందన్నా) తండ్రి (రావు రమేశ్‌)చాటు కూతురు. పీజీ చదివేందుకు తొలిసారి తండ్రిని వదిలి నగరానికి వెళ్లి ఓ కాలేజీలో చేరుతుంది. అదే కాలేజీలో విక్రమ్‌ (దీక్షిత్‌ శెట్టి), దుర్గ (అను ఇమ్మాన్యుయేల్‌) కూడా చేరతారు. దుర్గ.. విక్రమ్‌ను ప్రేమిస్తే.. అతడు మాత్రం భూమాను లవ్‌ చేస్తాడు. ప్రేమ జోలికి వెళ్లకూడదనుకుంటూనే భూమా కూడా అతడితో ప్రేమలో పడిపోతుంది. తర్వాత ఏం జరిగింది? భూమా జీవితం విక్రమ్‌ కంట్రోల్‌లోకి వెళ్లిందని తెలుసుకుని ఆమె ఏం చేసింది? అన్నదే మిగతా కథ.
 

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)