Breaking News

బాలీవుడ్‌ నటుడితో పుష్ప భామ స్టెప్పులు.. వీడియో వైరల్

Published on Sat, 09/24/2022 - 19:42

పుష్ప బ్యూటీ రష్మిక మందన్నా మరోసారి వార్తల్లో నిలిచింది. టాలీవుడ్‌లో పుష్పతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ పొందిన ఈ అమ్మడు బాలీవుడ్‌లోని ఓ టీవీ షోలో తనదైన స్టెప్పులతో అదరగొట్టింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందతో కలిసి కాలు కదిపింది. పుష్ప సినిమాలో సూపర్‌ హిట్ సాంగ్‌' రా రా సామీ బంగారు సామీ' అంటూ తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. హిందీలో ప్రసారమవుతున్న సూపర్ మామ్స్‌-3 షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ ప్రోమోలో ఈ అమ్మడు తన స్టెప్పులతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

(చదవండి: ఆ రోజు 'గుడ్‌ బై' చెప్పనున్న రష్మిక మందన్నా!)

సూపర్ మామ్స్- 3 గ్రాండ్ ఫినాలేలో రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రోమో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది జీ టీవీ.  15 సెకన్ల వీడియోలో బాలీవుడ్ నటుడు గోవిందతో కలిసి వేదికపై సామీ సామీ స్టెప్పులతో దుమ్ము రేపింది. ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్న సూపర్ మామ్స్ గ్రాండ్ ఫినాలే ఫుల్ ఎపిసోడ్‌లో ఈ బ్యూటీ కనిపించనుంది. ఆమె బాలీవుడ్‌లో బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించిన  చిత్రం 'గుడ్‌బై' విడుదలకు సిద్ధమవుతోంది. 

కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా వరుస సినిమాలు చేస్తూ తగ్గేదే లే అంటోంది. టాలీవుడ్‌తో స్టార్‌డమ్‌ సంపాందించుకున్న ఈ అమ్మడు కోలీవుడ్, బాలీవుడ్‌లో ఫుల్‌ బిజీగా ఉంది. 'పుష్ప' మూవీతో తెలుగు, తమిళం, హిందీ ఆడియెన్స్‌ల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్‌లో విజయ్ నటిస్తున్న 'వారీసు' (వారసుడు) చిత్రంలో నటిస్తోంది. అలాగే 'పుష్ప 2'తోపాటు మరికొన్ని హిందీ, కోలీవుడ్ ప్రాజెక్టులు చేస్తోంది. 

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)