Breaking News

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ స్కామ్‌.. స్టార్‌ హీరో రణ్‌బీర్‌కు షాక్‌..

Published on Wed, 10/04/2023 - 15:56

ముంబై: మహదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ స్కామ్‌ కేసు బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈ కుంభకోణంతో సంబంధం ఉందన్న ఆరోపణలతో బాలీవుడ్‌ ప్రముఖులకు సమన్లు ఇచ్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సిద్ధమయ్యినట్లు ప్రచారం జరగ్గా అదే నిజమైంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌కు ఈడీ బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది. మహాదేవ్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌కు రణ్‌బీర్‌ ప్రచారకర్తగా వ్యవహరించాడు. తాజాగా అతడికి నోటీసులు జారీ చేసిన ఈడీ అక్టోబర్‌ 6న విచారణకు రావాలని ఆదేశించింది.

దుబాయ్‌లో ఉంటూ భారత్‌లో బెట్టింగ్‌ వ్యాపారం
కాగా సౌరభ్‌ చంద్రకర్‌, అతని భాగస్వామి రవి ఉప్పల్ ‘మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌’ ప్రమోటర్లు. దుబాయ్‌లో ఉంటూ వారు భారత్‌లో బెట్టింగ్ వ్యాపారం సాగిస్తున్నారు. సౌరభ్ చంద్రకర్ వివాహం ఇటీవల యూఎఈలోని ఆరవ అతిపెద్ద నగరమైన రాక్‌లో జరిగింది. ఈ పెళ్లికి ఆయన ఏకంగా రూ.200 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. బంధువులను, సెలబ్రిటీలను దుబాయ్‌ తీసుకొచ్చేందుకు ‍ప్రైవేట్‌ జెట్స్‌ సైతం ఏర్పాటు చేశాడు.

పెళ్లికి హాజరైన వారికి షాక్‌?
దీనికి సంబంధించిన చెల్లింపులను హవాలా ద్వారా నగదు రూపంలో చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి వచ్చిన సెలబ్రిటీలకు ఈడీ షాక్‌ ఇవ్వనున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. బాలీవుడ్ పెద్దలు ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థల నుంచి హవాలా ద్వారా నగదు చెల్లింపులు అందుకున్నారనేది ప్రధాన ఆరోపణ.  ఇప్పటికే మహాదేవ్ బుక్ యాప్ ఆన్‌లైన్ బెట్టింగ్  కుంభకోణంపై  అనేక రాష్ట్రాల్లో ఈడీ విచారణ జరుపుతోంది.

చదవండి:  నాకున్న కోరికల్లా ఒక్కటే.. దానికోసం ఎంతవరకైనా, ఎక్కడిదాకానైనా వెళ్తా.. మనోజ్‌ పోస్ట్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)