Breaking News

రాముడిగా రణ్‌బీర్‌.. రావణుడిగా యశ్‌?

Published on Thu, 07/20/2023 - 00:15

భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి.. ఇంకొన్ని వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామాయణం ఆధారంగా అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్‌ మల్హోత్రా ఓ సినిమాను నిర్మించనున్నట్లుగా ప్రకటన వచ్చి దాదాపు మూడేళ్లు ముగిసింది. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. దాంతో ఈ చిత్రం నిలిచి΄ోయిందా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.

అయితే అలాంటిదేమీ లేదని, ప్రీప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయని నిర్మాతలు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్‌ షూటింగ్‌ను ఆరంభించాలని నిర్మాతలు అనుకుంటున్నారన్నది తాజా సమాచారం. ఈ చిత్ర దర్శకుడు నితీష్‌ తివారి ఈ సినిమా పనులను మరింత వేగవంతం చేశారని బాలీవుడ్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట.

రాముడు,  సీత, లక్ష్మణుడు, రావణుడు, హనుమంతుడు వంటి ప్రధాన పాత్రలకు ఆర్టిస్టులను ఎంపిక చేసి, లుక్‌ టెస్ట్‌ను నిర్వహించేందుకు నితీష్‌ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. రాముడిగా రణ్‌బీర్‌ కపూర్, సీతగా ఆలియా భట్, రావణుడి పాత్రలో యశ్‌లు నటించనున్నారని, ముందు వీరి లుక్‌ టెస్ట్‌ జరుగుతుందని టాక్‌. మరి.. ఈ ‘రామాయణం’లో రియల్‌ లైఫ్‌ జంట ఆలియా, రణ్‌బీర్‌ సీతారాములుగా కనిపిస్తారా? ‘కేజీఎఫ్‌’లో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో విజృంభించిన యశ్‌ ఈ చిత్రంలో రావణుడిగా బీభత్సం సృష్టిస్తారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)