Breaking News

ఇది అన్ని టాక్‌ షోలలా ఉండదు

Published on Fri, 11/29/2024 - 04:16

ప్రస్తుత జెనరేషన్‌కు మార్పు అన్నది ఆక్సిజన్‌ లాంటిది. ప్రతిక్షణం నిత్య నూతనంగానే కాదు వినూత్నంగా చూడాలని కోరుకుంటుంది నేటి తరం. మామూలుగా ఇంటర్వ్యూ, టాక్‌ షోలంటే ఇద్దరు ఎదురెదురుగా పద్ధతిగా కూర్చోవడం నుండి నడుస్తూ మాట్లాడడం వరకు చూశాం. నాటి దూరదర్శన్‌ టాక్‌ షోల నుండి నేటి ఓటీటీ టాక్‌ షోల వరకు ఇంచుమించుగా ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు. కానీ వాటన్నిటికీ విభిన్నంగా నేటి తరం నేటివిటీకి దగ్గరగా ‘ది రానా దగ్గుబాటి షో’ ఉంది. దీనికి హోస్ట్‌గా పేరుకు తగ్గట్టే నేటి ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి వ్యవహరించడం విశేషం. ఈ కార్యక్రమం స్ట్రీమ్‌ అయ్యేకన్నా ముందు ప్రముఖ యాంకర్‌ సుమతో ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రమోషనల్‌ప్రోమో ఒకటి రిలీజ్‌ చేశారు.

ఆప్రోమోలోనే ఈ షోకి సంబంధించిన కాన్సెప్ట్‌ రిలీజ్‌ చేశారు. ప్రోమోలో సుమ స్టూడియోకి వచ్చి రానాను కలుస్తుంది. ‘టాక్‌ షో అన్నావు కదా... గెస్టులు ఎవరు? దానికి సంబంధించిన అధికారిక అనౌన్సమెంట్‌ ఇలా ఉండాలి’ అని రానాకి సూచిస్తుంటే, ‘నేను టాక్‌ షో అన్నాను కానీ అనౌన్స్‌మెంట్, ఇంట్రో అని చెప్పలేదు కదా... చాలా షోస్‌ ఇలానే రొటీన్‌గా చేస్తున్నావు కదా.. మా టాక్‌ షో వాటన్నిటికీ విభిన్నం’ అని రానా చెబుతారు. రానా అన్నట్టే ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన టాక్‌ షోస్‌ సంప్రదాయాన్ని ‘ది రానా దగ్గుబాటి షో’ బ్రేక్‌ చేసిందనే చెప్పాలి.

ముఖ్యంగా ఈ షోలో రానా హోస్ట్‌ అనే కంటే వచ్చిన గెస్ట్‌లతో ఫ్రెండ్లీగా మూవ్‌ అవుతూ క్యాజువల్‌గా షో నడపడం చాలా బాగుంది. ఈ షో మొదటి ఎపిసోడ్‌లో భాగంగా ప్రముఖ తెలుగు హీరో నాని, ‘హను–  మాన్‌’ ఫేమ్‌ తేజ సజ్జా, నటి ప్రియాంకా మోహన్‌ అతిథులుగా వచ్చారు. వారిని షోలకి పిలవడం దగ్గర నుండి వాళ్ళతో మాట్లాడడం, ఆటలాడడం అంతా సరికొత్తగా అనిపిస్తుంది. ఎదుటివారి అభిరుచిని కనిపెట్టడం మీడియాలో దర్శకులకు తెలిసినంత మరెవరికీ తెలిసుండదు. అలా వాళ్లు ప్రేక్షకుల నాడిని పడతారు కాబట్టే వారి కాన్సెప్ట్స్‌ ప్రేక్షకాదరణ పొందుతాయి. దానికి నిలువెత్తు నిదర్శనమే ఈ ‘ది రానా దగ్గుబాటి షో’. ప్రైమ్‌ వీడియో ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతున్న ఈ షో వర్తబుల్‌... వాచిట్‌. – హరికృష్ణ ఇంటూరు

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)