Breaking News

మూడు పార్టులుగా 'రామాయణం' సినిమా.. సీతగా ఆ బ్యూటీ?

Published on Sat, 10/07/2023 - 16:00

తింటే గారెలే తినాలి వింటే రామాయణమే వినాలి అన్నది ఫేమస్ సామెత. రామాయణ ఇతిహాసాన్ని ఎన్నిసార్లు, ఎన్నో భాషల్లో సినిమాగా తీసినా ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది. అది ఆ పుణ్య పురుషులైన సీతారాముల చరితం విశేషం. రామాయణం గురించి విపులంగా టీవీ సీరియలే తీశారు. ఇక చిత్రాలు చాలానే వచ్చాయి. ఇకపై కూడా వస్తూనే ఉంటాయి అనడానికి మరో నిదర్శనం తాజాగా రెడీ అవుతున్న రామాయణం మూవీనే. 

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!)

ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్‌, మధు మంతెన ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చాలా ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటికీ బండి ముందుకు కదల్లేదు. ఇప్పుడు దీని గురించి అప్డేట్ వచ్చింది. 'దంగల్' ఫేమ్ నితీష్‌ తివారి దర్శకత్వంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్‌, సీతగా సాయిపల్లవి, రావణాసురుడిగా 'కేజీఎఫ్‌' యష్‌ నటించనున్నట్లు టాక్. కాగా రామాయణాన్ని మూడు భాగాలుగా తీయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెడతారట. 

మొదటి భాగంలో సీతారాములకు సంబంధించిన సీన్స్, రెండవ భాగంలో రావణుడు సీతని లంకకు తీసుకెళ్లడం.. రామ, రావణాసురుల యుద్ధ సన్నివేశాలు ఉంటాయని ఇక మూడో భాగంలో లవకుశల పుట్టుకకు సంబంధించిన అంశాలు ఉంటాయని తెలుస్తోంది. పదేళ్ల ముందు తెలుగులో 'శ్రీరామరాజ్యం' చిత్రంలో నయనతార సీతగా మెప్పించారు. 'ఆదిపురుష్‌'లో కృతిసనన్ సీతగా నప్పలేదని అన్నారు. దీంతో సాయిపల్లవి సీతగా ఎలా ఉంటుందా అని ఇప్పటి నుంచే డిస్కషన్ మొదలైంది.

(ఇదీ చదవండి: మెగా ఇంట మొదలైన పెళ్లి సందడి.. చిరంజీవి ట్వీట్ వైరల్!)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)