Breaking News

పాకిస్థాన్‌లో 'రామాయణం' నాటకం.. ఫొటోలు వైరల్

Published on Mon, 07/14/2025 - 12:59

 

అవును మీరు విన్నది నిజమే. దాయాది దేశం పాకిస్థాన్‌లోని కరాచీలో 'రామాయణ' గాథని నాటకంగా ప్రదర్శించారు. ఈ స్టేజీ షోకు అద్భుతమైన ఆదరణ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి జనాలు కూడా బాగానే వచ్చారండోయ్. ఇంతకీ అసలెలా ఇది సాధ్యమైంది? నాటకం వేసింది ఎవరు?

పాకిస్థాన్ పేరు చెప్పగానే ఉగ్రదాడులు, మత కల్లోలాలు లాంటివే గుర్తొస్తాయి. కానీ ఆ దేశంలోనూ ఇప్పుడు రామాయణ గాథని నాటకం వేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కరాచీ నగరానికి చెందిన యోగేశ్వర్ కరేరా, రాణా కజ్మాలతో పాటు మరికొందరు నాటక రంగంపై ఉన్న ఇష్టంతో థియేటర్ ఆర్ట్స్‌తో పాటు వివిధ విభాగాల్లో శిక్షణ తీసుకున్నారు. వీళ్లంతా తన బృందానికి 'మౌజ్' అని పేరు పెట్టుకున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)

గతేడాది నవంబరులో తొలిసారి ఓ ఆర్ట్ గ్యాలరీలో రామాయణ నాటకాన్ని ప్రదర్శించారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మరిన్ని హంగులు జోడించి, ఏఐ టెక్నాలజీని కూడా కాస్త ఉపయోగించి తాజాగా మూడు రోజుల పాటు నాటకాన్ని కరాచీలోని ఆర్ట్స్ కౌన్సిల్‌లో మరోసారి ప్రదర్శించారు. దీనికి కూడా విశేష స్పందన వచ్చింది.

రామాయణ నాటకాన్ని ప్రదర్శించినందుకు తమకు ఎలాంటి విమర్శలు, బెదిరింపులు రాలేదని దర్శకుడు యోగేశ్వర్ కరేరా చెప్పుకొచ్చారు. ఈ పురాణ గాథకు విశేషాదరణ దక్కిందని అన్నారు. ఏదైతేనేం పాక్ దేశంలో రామాయణ నాటకం ప్రదర్శించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.

(ఇదీ చదవండి: ప్రముఖ నటి సరోజా దేవి కన్నుమూత)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)