Breaking News

ప్రశంసలతో పోల్చుకుంటే వసూళ్లు తక్కువే ఉన్నాయి: ‘ఆంధ్రకింగ్‌..’ నిర్మాత

Published on Wed, 12/03/2025 - 12:32

‘‘ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో మనం చాలా ఎమోషన్స్‌ చూశాం. కానీ, ఓ స్టార్‌ హీరో, ఫ్యాన్‌కి మధ్య ఉన్న భావోద్వేగాన్ని చెబుతూ, హ్యూమన్‌ ఎమోషన్‌ని కూడా టచ్‌ చేసిన సినిమా ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’. ఇలాంటి భావోద్వేగం ప్రపంచంలో ఎక్కడా లేదు... మన తెలుగు సినిమాకే సొంతం. మనం సినిమా లవర్స్‌... మంచి సినిమాకి గుర్తింపు వస్తూనే ఉంటుంది’’ అన్నారు రామ్‌ పోతినేని. మహేశ్‌బాబు పి. దర్శకత్వంలో రామ్‌ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’. ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 27న విడుదలైంది. 

ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన థ్యాంక్స్‌ మీట్‌లో వై. రవిశంకర్‌ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి ప్రశంసలతో పోల్చుకుంటే వసూళ్లు కాస్త తక్కువగానే ఉన్నాయి. నెక్ట్స్‌ వీక్‌ అద్భుతమైన రన్‌ ఉంటుందని నమ్ముతున్నాం. నేటి నుంచి థియేటర్స్‌ని విజిట్‌ చేసి, ఫ్యాన్స్‌ని కలుసుకుంటాం’’ అని తెలిపారు. ‘‘ఈ చిత్రంలో మహాలక్ష్మిలాంటి మంచి పాత్ర చేసినందుకు గర్వంగా ఉంది’’ అన్నారు భాగ్యశ్రీ. ‘‘ఇక్కడి నుంచి మా సినిమా చాలా లాంగ్‌ వెళ్లబోతోంది’’ అని మహేశ్‌బాబు పి. పేర్కొన్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ వివేక్, మెర్విన్‌ మాట్లాడారు.  

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)