Breaking News

భాగ్యశ్రీతో డేటింగ్‌.. స్పందించిన రామ్‌ పోతినేని!

Published on Tue, 11/25/2025 - 14:44

హీరో రామ్‌ పోతినేని(Ram Pothineni ), నటి భాగ్యశ్రీ బోర్సే  ప్రేమలో ఉన్నారనే వార్త గత కొన్నాళ్లుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ఆంధ్రకింగ్ తాలూకా’ మూవీ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని..అది కాస్త స్నేహబంధం దాటి ప్రేమగా మారిందనే ప్రచారం జోరుగా సాగింది. తాజాగా ఈ పుకార్లపై హీరో రామ్‌ పోతినేని స్పందించారు. ఆంధ్రాకింగ్‌ తాలుకా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రామ్‌ మాట్లాడుతూ.. భాగ్యశ్రీతో డేటింగ్‌ అనేది కేవలం రూమర్‌ మాత్రమే అని స్పష్టం చేశారు. 

‘ఆంధ్రకింగ్‌ తాలుకా’(Andhra King Taluka) సినిమా కోసం నేను ఒక ప్రేమ గీతం రాశాను. అప్పటి నుంచి ఈ రూమర్స్‌ మొదలయ్యాయి. భాగ్యశ్రీ(Bhagyashri Borse)పై మనసులో ప్రేమ లేనిదే ఇంత గొప్ప పాట ఎలా రాయగలడు? అని అంతా అనుకున్నారు. వాస్తవం ఏంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్‌ని ఎంపిక చేయకముందే నేను ఆ పాట రాశాను. సినిమాలో హీరో, హీరోయిన్ల పాత్రలను ఊహించుకొని ఆ లిరిక్స్‌ రాస్తే..అంతా మరోలా అనుకున్నారు’ అని రామ్ చెప్పుకొచ్చారు.

ఇక ఇదే విషయంపై మరో ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ కూడా స్పందించారు. రామ్‌ తనకు మంచి స్నేహితుడు మాత్రమే నని.. ఒక నటుడిగా ఆయన అంటే తనకు  ఎంతో గౌరవం అని చెప్పింది. ఆయన డెడికేషన్‌ చూసి ఎంతో నేర్చుకున్నానని..అంతకు మించి తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

ఆంధ్రకింగ్‌ తాలుకా సినిమా విషయానికొస్తే..పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌కి జోడీగా భాగ్యశ్రీ నటించింది. ఇందులో రామ్‌ ఒక స్టార్‌ హీరోకి అభిమానిగా నటించబోతున్నారు. కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్ర పోషించిన ఈ మూవీ నవంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)