Breaking News

ముంబై అండర్‌వరల్డ్ కథతో ఆర్జీవీ.. సరికొత్త ప్రయోగం

Published on Mon, 08/17/2026 - 19:38

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి క్రైమ్‌ జానర్‌లో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న ‘పోలీస్ కంపెనీ’ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రంలో నటుడు హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలో కనిపించనున్నారట. ముంబైలోని ఓ పోలీసు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్  జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

తొలుత ఈ ప్రాజెక్ట్‌ను వెబ్‌సిరీస్‌గా రూపొందించాలని నిర్మాతలు భావించినప్పటికీ కథలోని పాత్రల బలం, యాక్షన్ అంశాలను దృష్టిలో పెట్టుకుని రామ్‌గోపాల్‌ వర్మ దీన్ని రెండు భాగాల సినిమాగా తెరకెక్కించాలని సూచించినట్లు టాక్‌.

2027లో కొన్ని నెలల వ్యవధిలో..
టీ-సిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని రెండు భాగాలను ఒకేసారి చిత్రీకరించి, 2027లో కొన్ని నెలల వ్యవధిలో థియేటర్లలో విడుదల చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ‘పోలీస్ కంపెనీ’లో దయా నాయక్ చిన్ననాటి నుంచి ముంబై పోలీస్ వ్యవస్థలో ఆయన ఎదిగిన తీరును చూపించనున్నారట. 1990ల చివరి దశ, 2000ల ప్రారంభంలో ముంబై అండర్‌వరల్డ్‌పై పోలీసులు చేపట్టిన ఆపరేషన్లు కథలో ప్రధానాంశంగా ఉండనున్నాయని తెలుస్తోంది.

ఇదీ చదవండి: బీజేపీలో చేరిన కొరియోగ్రాఫర్‌ శ్రేష్టి వర్మ

Videos

అమరావతిలో సదుపాయాలు లేవు.. కూటమి పార్టీ MLA షాకింగ్ కామెంట్స్

చింతాడ రవి కుమార్ సంచల ప్రెస్ మీట్

టీచర్ల విషయంలో డబుల్ రూల్స్ ఎందుకు? లోకేష్ తీరుపై ఉపాధ్యాయ సంఘాల ఫైర్

Telangana SIR: 90 లక్షల మందికి నోటీసులు -CEO సుదర్శన్ రెడ్డి

పిఠాపురంలో TDPకి బిగ్ స్ట్రోక్..!

భారత్ ఎన్నికలపై ట్రంప్ ఫోకస్..! అమెరికాలో కొత్త రూల్స్ కు పిలుపు

రేవంత్ పై కోపమా అక్కా.. CM టూర్ లో మంత్రి మిస్సింగ్

ఫారిన్ మెడికల్ స్టూడెంట్స్ పై జూడాల సమ్మె ప్రభావం

ప్రియాంక కేసులో కీలక మలుపు నిందితులకు పోలీస్ కస్టడీ

BJPకి షాక్ ఇస్తూ.. విజయ్ ని మెచ్చుకున్న అన్నామలై..

Photos

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు)

+5

18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు)

+5

న్యూయార్క్‌ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు)

+5

కందుకూరులో వైభవంగా తేళ్ల పంచమి... పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : కన్నుల పండువగా ఇస్కాన్‌ దేవాలయ స్వర్ణోత్సవాలు (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా సందడి (ఫొటోలు)

+5

చిరునవ్వులు చిందిస్తూ శ్రియా సోయగాలు (ఫొటోలు)

+5

వయ్యారాలు ఒలకబోస్తున్న రకుల్‌ (ఫొటోలు)

+5

‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

బండ్ల గణేశ్‌ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)