రామ్‌నగర్‌ బన్నీ ఇద్దరికీ హిట్‌ ఇవ్వాలి: రామ్‌గోపాల్‌ వర్మ

Published on Wed, 10/02/2024 - 00:10

‘‘రామ్‌నగర్‌ బన్నీ’ సినిమా టీజర్, ట్రైలర్‌ చూస్తే మంచి కంటెంట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రహాస్‌ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు. బాగా నటించాడు కూడా. ఈ చిత్రం చంద్రహాస్‌తో పాటు ప్రభాకర్‌కు పెద్ద విజయం ఇవ్వాలి’’ అని డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ అన్నారు. చంద్రహాస్‌ హీరోగా శ్రీనివాస్‌ మహత్‌ (వెలిగొండ శ్రీనివాస్‌) దర్శకత్వం వహించిన చిత్రం ‘రామ్‌నగర్‌ బన్నీ’. విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్లుగా నటించారు.

 దివిజ ప్రభాకర్‌ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్‌ ΄÷డకండ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీనివాస్‌ మహత్‌ మాట్లాడుతూ– ‘‘రామ్‌నగర్‌ బన్నీ’ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. థియేటర్స్‌లో చూసి ఎంజాయ్‌ చేయండి’’ అన్నారు. ‘‘మా అన్నయ్య చంద్రహాస్‌కు ‘రామ్‌నగర్‌ బన్నీ’ పెద్ద సక్సెస్‌ ఇవ్వాలి’’ అని దివిజ ప్రభాకర్‌ చెప్పారు. ‘‘మా మూవీని రిలీజ్‌ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్‌ వారికి థ్యాంక్స్‌’’ అని మలయజ ప్రభాకర్‌ పేర్కొన్నారు.

 ‘‘నన్ను ఇంతకాలం ఆదరించిన తల్లులు, అక్కా చెల్లెళ్లు  మా ‘రామ్‌నగర్‌ బన్నీ’ సినిమా చూసి ఆదరించాలని  కోరుకుంటున్నాను’’ అన్నారు ప్రభాకర్‌ ΄÷డకండ. ‘‘మా ‘రామ్‌నగర్‌ బన్నీ’ సినిమా నచ్చని ప్రేక్షకులు మీ టికెట్‌ని ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా నాకు పంపితే మీ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను’’ అని చంద్రహాస్‌ తెలిపారు. ఈ వేడుకలో నిర్మాతలు దామోదర ప్రసాద్, కరాటే రాజు, హీరోయిన్లు రిచా జోషి, రీతు మంత్ర, అంబికా వాణి, విస్మయ శ్రీ, సంగీత దర్శకుడు అశ్విన్‌ హేమంత్, నటులు సమీర్, సలీమ్‌ ఫేకు, ఫైట్‌ మాస్టర్‌ రాము, లిరిక్‌ రైటర్స్‌ అవినాష్, సాగర్‌ తదితరులు మాట్లాడారు.

Videos

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)