Breaking News

'మిరాయ్‌' రివ్యూ ఇచ్చిన ఆర్జీవీ.. నన్ను నేనే కొట్టుకున్నానంటూ..

Published on Mon, 09/15/2025 - 11:03

తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయ్‌ సినిమా (Mirai Movie) భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఎడారిలో ఒయాసిస్సులా.. ఫ్లాపులతో సతమతమవుతున్న మంచు మనోజ్‌కు సక్సెస్‌ దొరికినట్లైంది. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ విజువల్‌ వండర్‌ సెప్టెంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌ గ్రాండ్‌గా ఉండటం సినిమాకు మరింత ప్లస్సయింది.

చివరిసారి ఎప్పుడు చూశానో..
ఈ సినిమా చూసిన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) ఎక్స్‌​ (ట్విటర్‌) వేదికగా రివ్యూ ఇచ్చారు. మిరాయ్‌ చూశాక.. ఇంత మంచి వీఎఫ్‌ఎక్స్‌ ఉన్న సినిమా చివరిసారి ఎప్పుడు చూశానో గుర్తు రావడం లేదు. రూ.400 కోట్లకుపైగా ఖర్చు పెట్టి తీసిన సినిమాల్లోనూ ఇంత గ్రాండ్‌ విజువల్స్‌ చూడనేలేదు. ముందుగా మనోజ్‌ను ఈ సినిమాలో విలన్‌గా తీసుకుని తప్పు చేశారనుకున్నాను. కానీ సినిమా చూశాక అతడి పర్ఫామెన్స్‌ చూసి నన్ను నేనే కొట్టుకున్నా.. 

నా అంచనా తప్పు
ఇంత పెద్ద యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీలో తేజ మరీ చిన్నపిల్లాడిలా కనిపిస్తాడేమో అనుకున్నా.. ఇక్కడ కూడా నా అంచనా తప్పయింది. విజువల్స్‌, బీజీఎమ్‌, స్క్రీన్‌ప్లే.. అన్నీ అదిరిపోయాయి. ఇంటర్వెల్‌ సహా మరికొన్ని చోట్ల సినిమా నెక్స్ట్‌ లెవల్‌కు వెళ్లింది. కత్తులు, అతీంద్రియ శక్తుల బెదిరింపుల మధ్యలో ప్రేమ, మోసం వంటి అంశాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించారు. 

లాభాలొక్కటే కాదు..
కార్తీక్‌.. మిరాయ్‌ మీరు కన్న అద్భుతమైన కల. పురాణాలను, హీరోయిజాన్ని కలగలిపి చూపించారు. అన్ని విభాగాలపై మీకున్న పట్టు వల్లే ఇది సాధ్యమైంది. విశ్వప్రసాద్‌.. మీరు సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి రాకపోయినా మీకున్న ప్యాషన్‌ వల్లే ఈ ప్రాజెక్ట్‌ సాధ్యమైంది. ఇండస్ట్రీ పెద్దలు వార్నింగ్‌ ఇచ్చినా లెక్కచేయలేదు, మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు. తద్వారా విజయం సాధించారు. లాభాలు తీసుకురావడమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను సృష్టించడం కూడా చిత్రయూనిట్‌ బాధ్యత అని నిరూపించారు.

మనోజ్‌ రిప్లై
చివరగా నేను చెప్పేదేంటంటే.. ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా అని రాసుకొచ్చారు. దీనికి మంచు మనోజ్‌ (Manchu Manoj).. అన్నా, మీ స్పంద చూస్తుంటే నాకు గూస్‌బంప్స్‌ వస్తున్నాయి. చిన్నప్పటినుంచి మీ సినిమాలు చూస్తూ, మీతో కలిసి పనిచేస్తూ పెరిగాను. మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇప్పుడు మీ నోటి నుంచి నా నటనకు ప్రశంసలు దక్కుతుంటే సంతోషంగా ఉంది అని రిప్లై ఇచ్చాడు.

 

 

చదవండి: ఆ నలుగురు ఫేక్‌.. నమ్మకం పోతే మళ్లీరాదంటూ ఏడ్చేసిన శ్రష్టి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)