Breaking News

సిస్టర్‌కు విషెస్ తెలిపిన గ్లోబల్ స్టార్‌.. సోషల్ మీడియాలో పోస్ట్!

Published on Wed, 12/18/2024 - 16:50

మెగా హీరో రామ్ చరణ్ తన చెల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ మెగా డాటర్ నిహారిక కొణిదెల బర్త్ డే కావడంతో ప్రత్యేకంగా విష్ చేశారు. హ్యాపీ బర్త్‌ డే నిహారిక.. వచ్చే ఏడాదిలో నువ్వు మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అంటూ చెర్రీ ట్విటర్‌ వేదికగా పోస్ట్ చేశారు. తనతో దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు.

కాగా.. మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్‌లో పని చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి ఇప్పటికే పూజా కార్యక్రమం కూడా నిర్వహించారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ పట్టాలెక్కనుంది. మరోవైపు రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌ గేమ్ ఛేంజర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. కోలీవుడ్ స్టార్ ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో అభిమానుల్లో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల యూఎస్‌ ప్రీమియర్స్‌కు సంబంధించి టికెట్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. ఈ చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)