Breaking News

స్నేహితులతో కలిసి మహాకుంభ మేళాకు ఉపాసన.. పోస్ట్ వైరల్

Published on Sat, 02/08/2025 - 21:19

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్‌ మేళాకు వెళ్లారు. తన సోదరి, మరికొందరు స్నేహితులతో కలిసి కుంభమేళాకు వెళ్తున్న ఫోటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం ఆరు గంటలకే ప్రయాగ్‌ రాజ్‌ విమానాశ్రయం చేరుకున్నట్లు పోస్ట్‌లో తెలిపింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కొద్ది రోజులు పలువురు సినీ ప్రముఖులు సైతం గంగానదిలో పవిత్రస్నానాలు ఆచరించారు. మూడు లడ్డూలతో కలిసి కుంభ్ మేళాను వెళ్తున్నానంటూ తన ఫ్రెండ్స్‌ను ఉద్దేశించి ఫన్నీగా రాసుకొచ్చింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా.. రామ్ చరణ్‌ ప్రస్తుతం ఆర్సీ16తో బిజీగా ఉన్నారు. ఇటీవల షూటింగ్‌ సెట్‌లోని ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నందున రామ్ చరణ్‌ యాత్రకు వెళ్లలేదు. ఈ ఏడాది సంక్రాంతికి  గేమ్ ఛేంజర్‌ మూవీతో అభిమానులను పలకరించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినంత స్థాయిలో రాణించలేకపోయింది.

యూపీలో జరుగుతున్న కుంభ మేళాకు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. రానా దగ్గుబాటి భార్య మిహీకా బజాజ్ తన తల్లితో కలిసి ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో  పోస్ట్ చేసింది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సైతం తన తల్లి మాధవితో కలిసి మహాకుంభ్ మేళాకు హాజరయ్యారు. కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి ఇటీవలే కుంభ్ మేళాలో కనిపించారు.
 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)