Breaking News

రామ్‌చరణ్‌ దంపతులకు ఆయోధ్య ఆహ్వానం

Published on Sat, 01/13/2024 - 13:41

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. శ్రీరాములవారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రాజకీయ, సినీ ప్రముఖులు, కళాకారులు, సాధువులు హాజరు కానున్నారు. జనవరి 22న జరగబోయే ఈ విశేష కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్‌, చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, కంగనా రనౌత్‌, జాకీ ష్రాఫ్‌, టైగర్‌ ష్రాఫ్‌, రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌, ధనుష్‌.. తదితరులకు ఆహ్వానాలు అందాయి.

మొన్న తండ్రికి, ఇప్పుడు తనయుడికి పిలుపు
తాజాగా రామ్‌చరణ్‌ దంపతులకు అయోధ్య వేడుకకు రమ్మని పిలుపు అందింది. ఆరెస్సెస్‌ నేత సునీల్‌ అంబేద్కర్‌.. హైదరాబాద్‌లోని రామ్‌చరణ్‌ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. మరోవైపు హనుమాన్‌ చిత్రయూనిట్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ప్రీమియర్‌ షోల ద్వారా వచ్చిన రూ.14.25 లక్షలను అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళంగా ఇచ్చింది.

ఎవరూ ఆకలితో వెళ్లకుండా
కాగా అయోధ్యలో జరగనున్న శ్రీరాముని పవిత్రోత్సవానికి వచ్చేవారు ఆకలితో వెనుదిరగకుండా ఉత్సవ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 45 ప్రాంతాల్లో భోజనశాలలు సిద్ధం చేస్తున్నారు. భక్తులకు వివిధ రాష్ట్రాల వంటకాలను అందుబాటులో ఉంచననున్నారు. శ్రీరాముడి కోసం 2.5 కిలోల బంగారు విల్లును సిద్ధం చేస్తున్నారు. విల్లు, బాణాలను రాములవారి విగ్రహానికి అలంకరించనున్నారు.

చదవండి: హను-మాన్ తొలి రోజు కలెక్షన్స్‌ ఎన్ని కోట్లంటే?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)