Breaking News

రేపే రామ్ చరణ్ RC17 ముహూర్తం.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరంటే?

Published on Sat, 10/31/2026 - 15:01

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌ ఎట్టకేలకు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నవంబర్‌ 1న లాంఛనంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో సినిమాను మొదలుపెట్టనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాత రవిశంకర్‌ వెల్లడించారు. దీంతో చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రాజెక్టుపై మరోసారి సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

‘RC17’(వర్కింగ్‌ టైటిల్‌)ను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని టీ-సిరీస్‌ సమర్పిస్తోంది. గతంలో సుకుమార్‌, రామ్‌ చరణ్‌ కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారనే ఆసక్తి నెలకొంది.

దేవిశ్రీ ప్లేస్‌లో అనిరుధ్‌?
ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ రవిచందర్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సుకుమార్‌ గత చిత్రాలకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్‌ కాకుండా ఈసారి అనిరుధ్‌ బాధ్యతలు చేపట్టనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పూజా కార్యక్రమం రోజు హీరోయిన్‌తో పాటు సంగీత దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. 

(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్లకు షాక్.. #RC17లో ఛాన్స్ ఈమెకా?)

Videos

ఆత్మకూరులో అర్థరాత్రి ఖాళీగా బ్యాలెట్ బాక్సులు... అసలు ఏం జరుగుతుంది

ఆసుపత్రి బెడ్‌పై రాక్షసుడు.. కాళ్లు తొలగించే ఆలోచనలో డాక్టర్లు

దారుణం..ఇదేనా మానవత్వం అంటే..?

రిగ్గింగ్ చేస్తా నా కొడ*** ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరుడు బరితెగింపు వ్యాఖ్యలు

తెలంగాణపై అమిత్ షా గురి.. చిరంజీవి, రామ్ చరణీతో భేటీ

ఏపీకి బిగ్ అలర్ట్.. ముంచుకొస్తున్న మురసు తుఫాన్

బెంగళూరు హాస్పిటల్‌కి చేరుకున్న వైఎస్ జగన్

ఏకంగా ఒక రంపం తీసుకుని... బాలిక ఘటనపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందులలో రీపోలింగ్ జరపాలని హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్...

రాప్తాడు బాలిక ఘటన పై వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

Photos

+5

'సీన్' కోసం నజ్రియా బిజీ బిజీగా (ఫొటోలు)

+5

ఆషిక నవ్వితే నక్షత్రాలు మెరిసినట్లే (ఫొటోలు)

+5

మాల్దీవుల్లో 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ (ఫొటోలు)

+5

జిమ్-ఫుడ్-ఫ్యామిలీ.. అనసూయ అక్టోబర్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)