బర్త్‌ డే స్పెషల్‌

Published on Sun, 02/16/2025 - 05:48

‘ఉప్పెన’ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు(Buchi Babu) సానా ద్వితీయ చిత్రాన్ని హీరో రామ్‌చరణ్‌(Ram Charan)తో చేసే అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్‌ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘ఆర్‌సీ 16’ అనే వర్కింగ్‌ టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా మూవీలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా శనివారం (ఫిబ్రవరి 15) బుచ్చిబాబు బర్త్‌ డే.

ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో ‘ఆర్‌సీ 16’ యూనిట్‌ ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకని నిర్వహించారు. రామ్‌చరణ్‌ కూడా బుచ్చిబాబుతో కలిసి ఉన్న ఫొటోని సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే.. ‘ఆర్‌సీ 16’ సినిమా తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ముగిసింది.

రామ్‌ చరణ్‌తో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు బుచ్చిబాబు. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది. శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, ‘మీర్జాపూర్‌’ ఫేమ్‌ దివ్యేందు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)