Breaking News

గ్లోబల్ స్టార్‌కు ‍అరుదైన గౌరవం.. ఆ వేడుకల్లో పాల్గొననున్న హీరో!

Published on Fri, 07/19/2024 - 15:31

గోబల్ స్టార్‌ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని 15వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ ఈవెంట్‌కు రామ్ చరణ్‌కు ఆహ్వానం లభించింది. ఈ వేడుకలో గౌరవ అతిథిగా ఆయన పాల్గొననున్నారు. భారతీయ సినిమాకు చేసిన కృషికి గానూ ఈ వేడుకలో ఇండియ‌న్ ఆర్ట్ అండ్ కల్చ‌ర్ అంబాసిడర్‌గా అవార్డ్ అందుకోనున్నారు. విక్టోరియన్ రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది ఆగస్టు 15-25 వరకు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఐఐఎఫ్‌ఎం తన ట్విటర్ ద్వారా వెల్లడించింది.

ఈ ఏడాది జరగనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌కు కూడా రామ్ చరణ్ గౌరవ అతిథిగా రానున్నారు. మీరు ఉత్సాహంగా ఉన్నారా? ఎందుకంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 2024కి వస్తున్నారు. నాటు నాటుకు డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో పాటు రామ్ చరణ్‌ ఫోటో ఉన్న పోస్టర్‌ను పంచుకున్నారు.  ఈ ఫిలిం ఫెస్టివల్‌లో భారతీయ సినిమాకి ఆయన చేసిన సేవలను గౌరవిస్తూ భారతీయ కళ, సంస్కృతికి అంబాసిడర్‌ అవార్డ్‌ను రామ్ చరణ్‌కు అందజేయనున్నారు. అంతర్జాతీయ వేదికపై జరుపుకునే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో భాగమైనందుకు నేను చాలా గౌరవంగా  ఉందంటూ రామ్ చరణ్‌ టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది.

కాగా.. చివరిసారిగా ఆర్ఆర్ఆర్‌లో కనిపించిన రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌లో నటిస్తున్నారు. శంకర్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ఏడాది చివర్లో గేమ్ ఛేంజర్‌ థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చెర్రీ నటించనున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్.. చెర్రీ సరసన కనిపించనుంది. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?