Breaking News

'పెద్ది' ఫైట్.. స్టార్ హీరో తండ్రి ఆధ్వర్యంలో!

Published on Sat, 11/29/2025 - 15:46

మెగాహీరో రామ్ చరణ్.. 'పెద్ది' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 'చికిరి' హిట్ కాగా.. డిసెంబరులో మరో పాట వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఈసారి ఎలాంటి సాంగ్ రాబోతుందోనని అభిమానులు అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే హైదరాబాద్‌లో ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నారు. ఇది బాలీవుడ్ స్టార్ హీరో తండ్రి ఆధ్వర్యంలో తీస్తుండటం విశేషం. ఇంతకీ సంగతేంటి?

'పెద్ది' మూవీ ప్రకటించినప్పుడు ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే గ్లింప్స్, చికిరి చికిరి సాంగ్ వచ్చిందో.. తర్వాత నుంచి హైప్ పెరుగుతూ వస్తోంది. అందుకు తగ్గట్లే దర్శకుడు బుచ్చిబాబు పనిచేస్తున్నాడని తెలుస్తోంది. మూవీలో ఏకంగా ఎనిమిది ఫైట్ సీక్వెన్స్‌లు ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో ఒకటి ఇప్పుడు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో తీస్తున్నారట. దీనంతటినీ హిందీ హీరో విక్కీ కౌశల్ తండ్రి శామ్ కౌశల్.. దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట. ఈయన గతంలో 'దంగల్' చిత్రానికి యాక్షన్ కొరియోగ్రాఫీ చేశారు.

'పెద్ది' చిత్రాన్ని ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ స్టోరీ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. క్రికెట్, కబడ్డీ లాంటి గేమ్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇందులో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. జగపతిబాబు, దివ్యేందు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలో రిలీజ్ అని అన్నారు. రీసెంట్ టైంలో పాన్ ఇండియా సినిమాలన్నీ చెప్పిన తేదీకి అస్సలు రావడం లేదు. మరి 'పెద్ది' చెప్పిన టైంకి వస్తాడా లేదంటే వాయిదా వేస్తాడా అనేది చూడాలి?

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)