Breaking News

'కలెక్టర్‌కి ఆకలేస్తోంది అంటా'... 'గేమ్ ఛేంజర్‌' ట్రైలర్‌ చూసేయండి

Published on Thu, 01/02/2025 - 17:47

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్'(Game Changer Movie). స్టార్ డైరెక్టర్‌ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ పాటలకు సంబంధించి మూవీ టీమ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను (Game Changer Trailer)మేకర్స్ రిలీజ్ చేశారు.

(ఇది చదవండి: Game Changer: తగ్గిన రామ్‌ చరణ్‌ రెమ్యునరేషన్‌!)

తాజాగా రిలీజైన గేమ్ ఛేంజర్ ట్రైలర్‌ చూస్తే ఫుల్ యాక్షన్‌ అండ్ పొలిటికల్‌ స్టోరీగానే తెరెకెక్కించినట్లు తెలుస్తోంది. ఫైట్స్, డైలాగ్స్ మెగా ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. రామ్ చరణ్, ఎస్‌జే సూర్య మధ్య సన్నివేశాలు ఆడియన్స్‌లో అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. 'నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్‌.. నేను చనిపోయే వరకు ఐఏఎస్‌' ‍అనే డైలాగ్‌ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ట్రైలర్ చివర్లో వచ్చే 'అర్థమయిందిరా.. రా కి రా.. సర్‌ కి సర్‌..' అనే డైలాగ్‌ ఎస్‌జే సూర్యతో చెప్పే డైలాగ్‌ మెగా ‍ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. దాదాపు 2 నిమిషాల 40 సెకన్ల పాటు ఉన్న గేమ్ ఛేంజర్‌ ట్రైలర్‌లో ఫైట్స్, విజువల్స్‌లో డైరెక్టర్ శంకర్‌ మార్క్ కనిపిస్తోంది. 

(ఇది చదవండి: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్‌'.. కేవలం పాటలకే అన్ని కోట్లా!)

ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శంకర్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ కావడంతో కోలీవుడ్‌లోనూ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా ‍‍అద్వానీ హీరోయిన్‌గా నటించింది. కోలీవుడ్ హీరో ఎస్‌జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు,  శిరీష్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్ పొంగల్ కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. 


 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)