Breaking News

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్‌'.. కేవలం పాటలకే అన్ని కోట్లా!

Published on Thu, 01/02/2025 - 16:10

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. స్టార్ డైరెక్టర్‌ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ పాటలకు సంబంధించి మూవీ టీమ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

ఈ చిత్రంలోనే నాలుగు పాటల కోసం ఏకంగా రూ.75 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పోస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. కేవలం పాటలకే ఇంత భారీ బడ్జెట్‌ ఖర్చు చేయడంపై టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ చిత్రం మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా.. గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే నాలుగు పాటలను విడుదల చేశారు. రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తున్నాయి. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. మొదటి సాంగ్ జరగండి.. జరగండి అనే పాట ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో 600 డ్యాన్సర్లు పాల్గొన్నారు. దాదాపు 13 రోజుల పాటు షూటింగ్‌ చేశారు. ఈ సాంగ్‌లో విజువల్స్ ఫ్యాన్స్‌ను అలరించాయి.

1000 మంది డ్యాన్సర్లతో..

సెకండ్ సింగిల్‌ రా మచ్చా రా.. అంటూ సాగే రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగించింది. ఈ పాట  యువతను విపరీతంగా ఆకట్టుకుంది.  గణేశ్‌ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో 1000 మందికిపైగా జానపద కళాకారులు పాల్గొన్నారు.

గేమ్ ఛేంజర్ నుంచి మరో సాంగ్ 'నానా హైరానా' కూడా సినీ ప్రియులను ‍అలరించింది. తొలిసారి ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాతో తీసిన తొలి ఇండియన్‌ సాంగ్‌గా రికార్డ్‌ సృష్టించింది. ఈ సాంగ్‌ను పచ్చదనానికి కేరాఫ్ అడ్రస్ అయిన న్యూజిలాండ్‌లో తెరకెక్కించారు. దాదాపు ఆరు రోజుల పాటు ఈ పాటను షూట్‌ చేశారు.

ఇటీవల యూఎస్‌లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా 'దోప్' అనే నాలుగో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట కోసం రష్యాకు చెందిన 100 మంది ప్రొఫెషనల్‌ డ్యాన్సర్లను ఇండియాకు తీసుకొచ్చారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ సిటీలో ఈ పాటను తెరకెక్కించారు.

కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. కోలీవుడ్ స్టార్ హీరో ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతి బాక్సాఫీస్ సినిమాలతో పోటీ పడనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)