Breaking News

బాబాయ్‌ సినిమాను పట్టించుకోని రామ్ చరణ్.. ఆ మెగా హీరోలు మాత్రం!

Published on Thu, 07/24/2025 - 15:48

పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం హరిహర వీరమల్లు. దాదాపు ఐదేళ్లపాటు షూటింగ్ చేసిన ఈ సినిమా ఎట్టకేలకు జూలై 24న థియేటర్లలో విడుదలైంది. ఎప్పటి నుంచి ఈ చిత్రం కోసం నిరీక్షించిన అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. బాక్సాఫీస్ బద్దలవుతుందని రిలీజ్‌కు ముందు హల్‌చల్‌ చేశారు. కానీ తొలి ఆట నుంచే ఊహించని విధంగా ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఉత్సాహంగా థియేటర్‌కు వెళ్లిన అభిమానులు.. బయటికి వచ్చేటప్పుడు మాత్రం ఆ జోష్ కనిపించలేదు. దీంతో తొలిరోజే వీరమల్లుకు పెద్ద షాక్‌ తగిలినట్లే అర్థమవుతోంది.

అయితే హరిహర వీరమల్లు రిలీజ్‌ కావడంతో మెగా హీరోలంతా పవన్ కల్యాణ్ సినిమాకు ఆల్ ది బెస్ట్‌ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మెగా హీరోల్లో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌ ట్వీట్ చేస్తూ సినిమా సక్సెస్ కావాలంటూ ట్వీట్ చేశారు. వీరితో పాటు పలువురు టాలీవుడ్ తారలు వీరమల్లు చిత్రం రిలీజ్‌ వేళ మద్దతుగా పోస్టులు పెట్టారు.

అయితే మెగా హీరో, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మాత్రం బాబాయ్ సినిమా రిలీజ్‌కు ముందు ఎలాంటి పోస్ట్ చేయలేదు. ట్రైలర్ రిలీజ్‌ రోజు మాత్రమే పోస్ట్ పెట్టిన చెర్రీ.. హరిహర వీరమల్లు విడుదలకు ముందు ఎలాంటి విషెస్‌ చెప్పలేదు. దీంతో బాబాయ్‌ సినిమాకు చెర్రీ పోస్ట్‌ పెట్టకపోవడంపై నెటిజన్స్‌ చర్చించుకుంటున్నారు. మరోవైపు పెద్ది సినిమాతో బిజీగా ఉండడం వల్లే కుదరక పోయి ఉండొచ్చని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా బాబాయ్ చిత్రానికి మెగా హీరో రామ్ చరణ్ సపోర్ట్ చేయకపోవడం గమనార్హం.

 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)