Breaking News

మెగా ప్రిన్సెన్స్ 'క్లీంకార' ఫస్ట్ వీడియో.. చరణ్ చేతుల్లో అలా!

Published on Thu, 07/20/2023 - 16:53

మెగా ప్రిన్సెస్ సందడి మొదలై, అప్పుడే నెలరోజులు అయిపోయింది. ఈ రోజు(జూలై 20) ఉపాసన పుట్టినరోజు. ఈ క్రమంలోనే అందరూ ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. రామ్‌చరణ్ మాత్రం ఈ రోజుని ఇంకాస్త స్పెషల్‌గా ఉండేలా ప్లాన్ చేశాడు. తన భార్య పుట్టినరోజు, కూతురు పుట్టి నెల పూర్తయిన సందర్భంగా ఓ స్పెషల్ వీడియోని షేర్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు.

రామ్ చరణ్ షేర్ చేసిన వీడియోలో.. చాలా అద్భుతమైన విజువల్స్‌ని చూపించారు. 2012లో చరణ్-ఉపాసన పెళ్లి వీడియో బిట్‌‌తో పాటు చరణ్, ఉపాసన మాట‍్లాడిన విజువల్స్ కూడా ఉన్నాయి. దాదాపు 3 నిమిషాలున్న ఈ వీడియోలో ఉపాసన డెలివరీ రోజు ఆస్పత్రిలో, నామకరణం రోజు ఇంట్లో ఏం జరిగిందనేది చూపించారు.

ఆపరేషన్ థియేటర్‌ లోపలికి చరణ్ వెళ్లడం, కూతురిని బయటకు తీసుకురావడం.. కుటుంబ సభ్యులు అందరూ ఆ పాపని చూసి మురిసిపోవడం లాంటి వాటిని ఈ వీడియోలో బ్యూటీఫుల్‌గా క్యాప్చర్ చేశారు. చివరగా ఉపాసన పాపని ఎత్తుకున్నట్లు చూపించి ఈ వీడియోని ఎండ్ చేశారు. ఏదేమైనా 'క్లీంకార' ఫస్ట్ వీడియో మాత్రం బ్యూటీఫుల్‌గా ఉంది.

రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ 'క్లీంకార పుట్టే టైంలో మా అంద‌రిలోనూ ఏదో తెలియ‌ని టెన్ష‌న్‌. అంతా స‌రిగ్గా జ‌ర‌గాల‌ని మేం అంద‌రూ ప్రార్థిస్తున్నాం. అందుకు త‌గిన‌ట్టే అన్నీ అనుకూలంగా పాప ఈ లోకంలోకి అడుగు పెట్టింద‌ని భావిస్తున్నా. పాప పుట్టిన ఆ క్ష‌ణం నా మ‌న‌సుకి ఆహ్లాదంగా, చాలా సంతోషంగా అనిపించింది. పాప రాకకు పట్టిన 9 నెల‌ల స‌మ‌యం, అప్పుడు జ‌రిగిన ప్రాసెస్ అంతా త‌లుచుకుని హ్యాపీగా ఫీల‌య్యాం' అని అన్నారు.

ఇదే వీడియోలో ఉపాస‌న కొణిదెల మాట్లాడుతూ.. 'మా పాప ద్రవిడ సంస్కృతిలో భాగం కావాల‌ని కోరుకున్నాను. ఆమె పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగులు ఇవ్వ‌ొద్దు. అలాంటి వాటిని వారే స్వ‌యంగా సాధించుకోవాల‌నేది నా అభిప్రాయం. పిల్ల‌ల పెంప‌కంలో ఇవెంతో కీలకం. జీవితంలో ప్ర‌తీ క్ష‌ణాన్ని ఆస్వాదించాలి' అని చెప్పారు. 
 

(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)