నా భార్యకు ఆరో నెల.. పుట్టబోయే బిడ్డ: రామ్‌చరణ్‌

Published on Mon, 03/13/2023 - 10:59

టాలీవుడ్‌ బెస్ట్‌ కపుల్‌లో రామ్‌చరణ్‌- ఉపాసన ఒకరు. 2012లో పెళ్లిపీటలెక్కిన వీరిద్దరూ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ మధుర క్షణాలను ఆస్వాదించకుండా తమ సమయాన్నంతా ఆర్‌ఆర్‌ఆర్‌కే అంకితం చేశారిద్దరూ.. ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి నాటు నాటు సాంగ్‌ ఆస్కార్‌కు నామినేట్‌ అయినప్పటి నుంచి అమెరికాలో వరుస ప్రమోషన్లు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు చరణ్‌. తనకు సపోర్ట్‌గా ఉంటూ భర్తతో పాటే అమెరికాలో ఉంది ఉపాసన. ఇటీవలే వీరిద్దరూ ప్రీఆస్కార్‌ వేడుకలకు హాజరవగా తాజాగా 95వ ఆస్కార్‌ సంబరాల్లో పాల్గొన్నారు.

రామ్‌చరణ్‌ బ్లాక్‌ సూట్‌లో రెడీ అవగా ఉపాసన సాంప్రదాయాలకు విలువనిస్తూ చీరలో కనిపించింది. ఆస్కార్‌ సెలబ్రేషన్స్‌ ప్రారంభమవడానికి ముందు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడింది ఉపాసన. 'రామ్‌కు నేనెప్పుడూ సపోర్ట్‌ చేస్తాను. ఆర్‌ఆర్‌ఆర్‌ ఫ్యామిలీలో భాగంగా నేనిక్కడకు వచ్చాను. నాకు కొంత ఆందోళనగా ఉంది. కానీ ఈరోజు ఇక్కడ ఉండటం ఎంతో సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చింది. ఇంతలో చరణ్‌ మాట్లాడుతూ... 'తనిప్పుడు ఆరు నెలల గర్భవతి. పుట్టబోయే బిడ్డకు ఎక్కడలేనంత ప్రేమ లభిస్తోంది. కడుపులో ఉండగానే తను మాకెంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది' అన్నాడు.

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)