నా చిన్ననాటి కల.. 'పెద్ది'తో నిజమవుతుంది: రామ్ చరణ్‌

Published on Sun, 11/09/2025 - 23:42

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో దర్శకుడు బుచ్చిబాబు చేస్తున్న చిత్రం పెద్ది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఇందులో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

ఇప్పటికే ఏర్పడ్డ భారీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బుచ్చిబాబు పెద్ది చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక రామ్ చరణ్ కూడా పెద్ది సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే, తాజాగా హైదరాబాద్‌లో ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్ జరిగింది. అందులో రెహమాన్ తాను చేసిన పాటలతో ఆడియన్స్‌ను ఉర్రూతలూగించాడు. భారీగా జరిగిన ఈ కాన్సర్ట్‌కు పెద్ది సినిమా టీం రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సనా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఏఆర్ రెహమాన్ గారితో సినిమా చేయడం నా చిన్ననాటి కల.. ఆ అవకాశం నాకు బాగా నచ్చిన పెద్ది లాంటి కథతో నిజం అవుతుండటం చాలా సంతోషంగా ఉంది. తాజాగా రిలీజైన చికిరి సాంగ్ అదిరిపోయింది. పెద్ది సినిమా కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది, అంటూ రెహమాన్‌పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ కామెంట్స్‌తో పెద్ది సినిమా చరణ్‌కు వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే పెద్ది సినిమాపై అంచనాలు ఇంకా పెంచుతున్నాయి.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)