Breaking News

'యాక్టింగ్‌ తెలియకపోయినా మాకు ఛాన్స్ ఇచ్చారు'.. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్..!

Published on Thu, 12/18/2025 - 22:06

టాలీవుడ్ హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా వస్తోన్న పీరియాడికల్‌ స్పోర్ట్స్‌ యాక్షన్‌ మూవీ ఛాంపియన్‌. ఈ మూవీకి ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం క్రిస్‌మస్‌ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. వైజయంతీ మూవీస్‌ సంస్థతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మా దత్తు గారికి, వైజయంతి మూవీస్‌కి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.  మమ్మల్ని బలంగా నమ్మి.. మాకు నటన వస్తుందో రాదో తెలియకపోయినా సినిమాలు ప్రొడ్యూస్ చేశారని అన్నారు. ఎన్టీఆర్‌కు స్టూడెంట్ నంబర్1, అల్లు అర్జున్‌కు గంగోత్రి, మహేశ్‌ బాబుకు రాజకుమారుడు, నాకు చిరుత.. ఇలా మా అందరికీ మోస్ట్ బ్యూటీఫుల్ పర్సన్‌ దత్తుగారేనని తెలిపారు. చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నా.. మాకు యాక్టింగ్ తెలియని టైమ్‌లో మమ్మల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారని రామ్ చరణ్ అన్నారు. 

రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'గంగోత్రితో అల్లు అర్జున్‌ను, రాజకుమారుడుతో మహేశ్‌బాబును, చిరుతతో నన్ను హీరోగా పరిచయం చేశారు అశ్వనీదత్‌. ఆయనకు మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మాది సినీ బ్యాక్‌ గ్రౌండ్‌ ఫ్యామిలీ కావొచ్చు. మేం యాక్టింగ్‌ చేస్తామో తెలియకపోయినా మాకు అవకాశం ఇచ్చిన వ్యక్తి. వైజయంతి మూవీస్‌ వారసత్వాన్ని ప్రియాంక, స్వప్న కొనసాగిస్తున్నారు. అంకిత భావంతో పని చేసే ఇలాంటి నిర్మాతలతో సినిమాలు చేయడం అదృష్టం. రోషన్‌ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఈ మూవీ పోస్టర్లలో హాలీవుడ్‌ హీరోలా  ఉన్నాడు. నా రెండో సినిమా మగధీరలా.. రోషన్‌ రెండో చిత్రం ఛాంపియన్‌ పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు.  ఈ ఈవెంట్‌లో శ్రీకాంత్‌, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కూడా పాల్గొన్నారు.
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి