Breaking News

ఎవరూ నాకు ఏ ఆస్తి బహుమతిగా ఇవ్వలేదు: రకుల్ ప్రీత్

Published on Mon, 10/05/2026 - 13:47

రీసెంట్‌గా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మామ వాసు భగ్నానీ, భర్త జాకీ భగ్నానీకి సంబంధించిన నిర్మాణ సంస్థ ఆఫీసులపై ఐటీశాఖ దాడులు చేసింది. అయితే వీటితో తనని లింక్ చేస్తుండటంపై రకుల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో సుధీర్ఘ పోస్ట్ పెట్టింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఆ సోదాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్ప‌ష్టం చేసింది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: సృష్టి ఎలిమినేట్.. నాలుగు వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే?)

'నా గురించి వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అబద్ధం. నేను ఆర్మీ నేపథ్యం నుంచి వచ్చాను. ఇండస్ట్రీలో నాకు ఎలాంటి గాడ్‌ఫాదర్ లేరు. కష్టపడి, బాధ్యతాయుతమైన పౌరురాలిగా, 20 ఏళ్ల వయసు నుంచే క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నాను. ఏ నిర్మాణ సంస్థ తరఫున చట్టవిరుద్ధమైన విదేశీ నగదు లావాదేవీలకు పాల్పడలేదు. దేశంలో కానీ, విదేశాల్లో కానీ ఎవరి తరఫునా నాకు ఎలాంటి బినామీ ఆస్తులు లేవు. ఎవరూ నాకు ఎప్పుడూ ఎలాంటి ఆస్తి బహుమతిగా ఇవ్వలేదు. ఇలాంటి ఖరీదైన బహుమతులు స్వీకరించడం నా రూల్స్‌కి విరుద్ధం. నాపై తప్పుడు కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలు వాటిని తీసేసి నిజాలు చెప్పాలి. మీడియా సంస్థలకు ఒత్తిళ్లు ఉంటాయని అర్థం చేసుకోగలను. కానీ వాటి కోసం నిజాల్ని త్యాగం చేయకూడదు. ఒక వ్యక్తి ప్రతిష్ఠ, జీవనోపాధిని దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదు' రకుల్ ప్రీత్ సింగ్ సీరియస్ అయింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు మిస్ కావొద్దు)

Videos

నిన్నే అడుగుతున్న... పెనుకొండలో ఉషశ్రీ చరణ్ భారీ ధర్నా

రజినీతో క్లాష్ మిస్... దుల్కర్ తో క్లాష్ ఫిక్స్..

జూలైలోనే విమానం కూల్చేందుకు కుట్ర... సంచలన విషయాలు

రాయలసీమ ద్రోహి చంద్రబాబు

YSRCP నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి కుట్ర

బాల్కనీ నుంచి జారిన చిన్నారి.. చివరి క్షణంలో ఎలా కాపాడాడంటే!

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో డెలివరీ బాయ్‌పై భార్యాభర్తల దాడి

ఫ్యాన్ కోసం సెక్యూరిటీని లెక్కచేయని ధావన్

తాట తీస్తాం చుట్టమల్లే డీప్ ఫేక్ పై నాగవంశీ వార్నింగ్

రాజకీయ ప్రయాణం బుక్ స్థితప్రజ్ఞుడు YS జగన్..

Photos

+5

మూవీ రిలీజ్ తర్వాత మళ్లీ ట్రెండింగ్‌లో నక్షత్ర (ఫొటోలు)

+5

ఎం.ఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్.. రష్మిక ఎమోషనల్ పోస్ట్ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్ కళ్యాణ్’మూవీ హీరోయిన్ మహిమ నంబియార్ (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ 'దేశీ గర్ల్' లుక్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్ : ఏపీలో ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలు...(ఫొటోలు)

+5

టెన్నిస్‌ కోర్టులో నటి వర్ష డిసౌజా.. (ఫొటోలు)

+5

రష్మిక రణబాలి లుక్‌.. అదిరిపోయిన స్టిల్స్(ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ భారత క్రికెటర్‌ శిఖర్ ధావన్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : దుర్గామాతకు జైకొడదాం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : సందడిగా దక్కన్‌ డెర్బీ మీట్‌ (ఫొటోలు)