'స‍్నానం చేస్తుండగా వీడియోలు తీసేవాడు'.. హీరోయిన్ తీవ్ర ఆరోపణలు!

Published on Wed, 08/23/2023 - 18:19

బిగ్ బాస్ కంటెస్టెంట్, బాలీవుడ్ నటి రాఖీసావంత్, ఆమె మాజీ భర్త ఆదిల్ దురానీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవలే జైలు నుంచి బయటకొచ్చిన ఆదిల్.. రాఖీసావంత్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి మోసం చేసిందని ఆరోపించాడు. అంతే కాకుండా నాకు తెలియకుండా అకౌంట్ నుంచి రూ.1.5 కోట్లు విత్ ‍డ్రా చేసిందని ఆరోపణలు చేశాడు. ఈ నేపథ్యంలోనే రాఖీ సావంత్ సైతం ప్రెస్ మీట్ పెట్టి అంతేస్థాయిలో రివర్స్ కౌంటరిచ్చింది. 

(ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. డిప్రెషన్‌లో నటుడు.. 10 ఏళ్ల బంధానికి స్వస్తి!)

మీడియాతో మాట్లాడుతూ ఆదిల్‌ దురానీపై సంచలన కామెంట్స్ చేసింది. ఆదిల్ తన ప్రియురాలైన ఇరానీ అమ్మాయిపై ఆరు నెలలపాటు అత్యాచారం చేశాడని ఆరోపించింది. అంతే కాకుండా తనను కొట్టి హింసించాడని వాపోయింది. అంతే కాకుండా లైంగిక వేధింపులకు గురిచేసి.. తన నగ్న వీడియోలను రికార్డ్ చేసి దుబాయ్‌లో విక్రయించాడని రాఖీసావంత్ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను వాష్‌రూమ్‌లో ఉన్నప్పుడు వీడియో రికార్డ్ చేసేవాడని.. అలాంటి వీడియోలు అతని వద్ద చాలా ఉన్నాయని రాఖీ పేర్కొంది. ఆ వీడియోలను దుబాయ్‌లో రూ. 47 లక్షల రూపాయలకు విక్రయించాడని రాఖీ సావంత్ ఆరోపిస్తోంది. 

ఆదిల్‌కు చాలామందితో వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయని.. మహిళలతో మాత్రమే కాకుండా పురుషులతో కూడా లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ప్రత్యక్షంగా చూశానని రాఖీ తెలిపింది. ఆ వీడియోల వల్ల తనకు ఏం చేయాలో తెలియడం లేదని వాపోయింది. నాపై కూడా ఇంట్లోనే అత్యాచారం చేశాడని రాఖీ ఏడుస్తూ ఆవేదన వ్యక్తం చేసింది.

నగ్న వీడియోలు వైరల్ అవుతాయని అనుక్షణం భయపడుతూ బతికానని చెప్పుకొచ్చింది. ఒక సెలబ్రిటీగా ప్రపంచానికి తన ముఖాన్ని ఎలా చూపించాలని ఆలోచిస్తూ కాలం వెళ్లదీశానని  తెలిపింది. కాగా.. పరస్పరం ఆరోపణలు చేసుకున్న రాఖీ-ఆదిల్‌ 2022లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

(ఇది చదవండి: లగ్జరీ కారు కొనుగోలు చేసిన స్టార్ హీరోయిన్.. ఎన్ని కోట్లంటే? )

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)