ప్రియుడిని సీక్రెట్‌గా పెళ్లాడిన రాఖీ సావంత్‌, ఫోటో వైరల్‌

Published on Wed, 01/11/2023 - 15:01

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ రాఖీసావంత్‌ ప్రియుడు అదిల్‌ ఖాన్‌ను సీక్రెట్‌గా పెళ్లాడింది. రాఖీ- అదిల్‌ రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో లవ్‌ బర్డ్స్‌ ఇద్దరూ దండలు మార్చుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుండగా.. వారి చేతిలో మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఫోటోలో రాఖీ కొన్ని పత్రాలపై సంతకం చేస్తున్నట్లుగా ఉంది. ఇకపోతే నెట్టింట వైరల్‌ అవుతున్న పెళ్లి సర్టిఫికెట్‌ ఆధారంగా వారు గతేడాదే పెళ్లి చేసుకున్నట్లు అర్థమవుతోంది. మరి ఈ విషయాన్ని ఎందుకు గుట్టుచప్పుడు కాకుండా దాచిపెట్టారనేది తెలియాల్సి ఉంది. 

కాగా రాఖీ సావంత్‌ గతేడాది భర్త రితేశ్‌తో విడిపోగా, అతడి నుంచి విడాకుల కోసం దరఖాస్తు చేసింది. అనంతరం మైసూర్‌కు చెందిన బిజినెస్‌మెన్‌ అదిల్‌తో ప్రేమలో పడ్డ ఆమె అతడిని ప్రియుడిగా మీడియాకు పరిచయం చేసింది. ఇటీవలే బిగ్‌బాస్‌ మరాఠీ నాలుగో సీజన్‌లో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది రాఖీ. ఇకపోతే ప్రస్తుతం రాఖీ తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. తన తల్లి బ్రెయిన్‌ ట్యూమర్‌తో పోరాడుతోందని, తను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండని అభిమానులను కోరింది రాఖీ సావంత్‌.

చదవండి: సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న బుల్లితెర బ్యూటీ
ధమాకా ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడంటే?

Videos

విజయవాడ దుర్గమ్మ గుడికి కరెంటు బంద్.. ఆలయ చరిత్రలో తొలిసారి..

మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు? పెమ్మసానికి బిగ్ షాక్

పుష్ప-2 తొక్కిసలాట కేసులో ఛార్జ్ షీట్ దాఖలు.. A11గా అల్లు అర్జున్

గొంతు కోసిన మాంజా.. యువకుడికి 19 కుట్లు!

నారాయణ మోసం వల్లే అమరావతి రైతు మృతి.. రామారావుకు YSRCP నివాళి

ఇటువంటి మోసగాళ్లను ఏపీ ప్రజలు ఎలా నమ్ముతున్నారు

ఒళ్ళు దగ్గర పెట్టుకో.. శివాజీ పై ప్రకాష్ రాజ్ ఫైర్

మాటలు జాగ్రత్త శివాజీ.. లైవ్ లో మహిళా కమిషన్ వార్నింగ్

ఈసారి ఇక కష్టమే.. పవన్ లో మొదలైన భయం

బాక్సాఫీస్ వార్ స్టార్ట్! 1000 కోట్ల బ్లాక్ బస్టర్ పై ఫోకస్

Photos

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణాలు.. పోటెత్తిన భక్తులు.. (చిత్రాలు)

+5

తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శివయ్యను మీరు ఎప్పుడైనా చూశారా (ఫొటోలు)

+5

హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్‌.. ట్రెండింగ్‌లో 'అనసూయ' (ఫోటోలు)

+5

హెబ్బా పటేల్ ‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

శివాజీ ‘దండోరా’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

విశాఖపట్నం : గంగమ్మా..మమ్మేలు మాయమ్మా! (ఫొటోలు)