Breaking News

'రాజు వెడ్స్ రాంబాయి' తొలిరోజు కలెక్షన్ ఎంత?

Published on Sat, 11/22/2025 - 15:29

ప్రతి శుక్రవారం చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుంటాయి. వీటిలో ప్రేక్షకులకు నచ్చేవి, కలెక్షన్స్ తెచ్చుకునే చిత్రాలు కొన్ని ఉంటాయి. పెద్దగా స్టార్స్ లేకపోయినా సరే కొన్ని మూవీస్ అద్భుతాలు చేస్తుంటాయి. నిన్న (నవంబరు 21) విడుదలైన వాటిలో అలా 'రాజు వెడ్స్ రాంబాయి' అనే సినిమా మిగిలిన వాటితో పోలిస్తే మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో తొలిరోజు షాకింగ్ వసూళ్లు వచ్చాయి. ఈ మేరకు నిర్మాతలు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

తేజస్వి రావు, అఖిల్ రాజ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని సాయిలు కాంపాటి అనే కొత్త దర్శకుడు తీశాడు. టీజర్, ట్రైలర్, పాటలతోనే కాస్త ఆసక్తి రేపింది. అందుకు తగ్గట్లే బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి టాక్ వచ్చింది. దీనితో పాటు అల్లరి నరేశ్ '12 ఏ రైల్వే కాలనీ', ప్రియదర్శి 'ప్రేమంటే' రిలీజైనప్పటికీ.. ఇవి అంతంత మాత్రంగానే ఉన్నాయని టాక్ వచ్చింది. దీంతో మూవీ లవర్స్.. 'రాజు వెడ్స్ రాంబాయి'కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. అలా తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.1.47 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చిందని పోస్టర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ మూవీ రివ్యూ)

ఏ మాత్రం స్టార్స్ హీరోహీరోయిన్లు గానీ డైరెక్టర్ గానీ లేని ఈ సినిమాకు ఈ మాత్రం వసూళ్లు రావడం అంటే నిజంగా ఆశ్చర్యమే. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మిగతా చిత్రాలతో పోలిస్తే ఇదే కాస్త లీడ్‌లో ఉంది. ఈ వీకెండ్‌తో పాటు వచ్చే వారం రామ్ 'ఆంధ్ర కింగ్ తాలుకా' రిలీజ్ అయ్యేవరకు ఎన్ని కోట్ల వసూళ్లు సాధిస్తుందో చూడాలి?

'రాజు వెడ్స్ రాంబాయి' విషయానికొస్తే.. 2010లో ఖమ్మం దగ్గర ఓ పల్లెటూరిలో జరిగే కథ. రాజు (అఖిల్ రాజ్) పెళ్లిళ్లకు బ్యాండ్ కొడుతుంటాడు. అదే ఊరిలో ఉండే రాంబాయిని(తేజస్వి రావు)ని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. ఆమె కూడా రాజు ప్రేమలో పడిపోతుంది. కానీ తనకు కాబోయే అల్లుడు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండాలనేది రాంబాయి తండ్రి వెంకన్న(చెతన్య జొన్నలగడ్డ) పట్టుదల. ఇంతలోనే రాజు-రాంబాయి ప్రేమ విషయం ఊరంతా తెలిసిపోతుంది. దీంతో వీళ్లిద్దరూ ఊరి వదిలి పారిపోవాలనుకుంటారు. తర్వాత ఏమైంది? చివరకు ప్రేమలో విజయం సాధించారా లేదా అనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: 'రాంబాయి'గా తేజస్వీ.. ఇంతకీ ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)