సారీ చెప్పిన 'రాజు వెడ్స్ రాంబాయి' డైరెక్టర్

Published on Fri, 11/21/2025 - 17:27

ఈ రోజు (నవంబరు 21) థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో కాస్త ఎడ్జ్ తీసుకున్న సినిమా 'రాజు వెడ్స్ రాంబాయి'. హీరోహీరోయిన్లు, దర్శకుడు అందరూ కొత్తవాళ్లే. అయినా సరే ఓ షాకింగ్ ప్రేమకథని ప్రెజెంట్ చేశారు. అందుకు తగ్గట్లే మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సరే ఈ సంగతి కాసేపు పక్కనబెడితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కాస్త ఆవేశానికి లోనైన డైరెక్టర్.. పెద్ద ఛాలెంజ్ చేశాడు. దానిపై ట్రోలింగ్ జరిగేసరికి ఇప్పుడు సారీ చెప్పేశాడు.

(ఇదీ చదవండి: ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ మూవీ రివ్యూ)

సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్న 'రాజు వెడ్స్ రాంబాయి' దర్శకుడు సాయిలు కాంపాటి, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. రిలీజ్ తర్వాత నెగిటివ్ టాక్ వస్తే అమీర్‌పేట్‌లో చొక్కా తీసి తిరుగుతా అని అన్నాడు. కానీ ఈ వ్యాఖ్యలపై ట్రోలింగ్ కాస్త గట్టిగానే వచ్చింది. సినిమా బాగుంటే సరే గానీ ఇంత పెద్ద స్టేట్‌మెంట్స్ అవసరమా అనే కామెంట్స్ వినిపించాయి. దీంతో ఇప్పుడు రియలైజ్ అయ్యాడు.

ఈ రోజు మధ్యాహ్నం సక్సెస్ మీట్ జరగ్గా ఇందులో మాట్లాడిన డైరెక్టర్ సాయిలు.. 'కొత్త డైరెక్టర్లకు మాట్లాడటం రాదు. దయచేసి క్షమించండి అన్న. అమీర్‌పేట్‌లో సాయంత్రం వచ్చి బ్యాండ్ కొడతా అన్నా' అని తన వ్యాఖ్యలని సవరించుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. అఖిల్ రాజ్, తేజస్వి రావు ఈ మూవీలో హీరోహీరోయిన్లుగా నటించారు. ఖమ్మంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కించారు.

(ఇదీ చదవండి: మనసు దోచేస్తున్న 'రాంబాయి'.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)