Breaking News

14 ఏళ్ల తరువాత మళ్లీ ఇక్కడకు వచ్చాను: రజనీకాంత్‌

Published on Sat, 02/08/2025 - 07:39

నటుడు రజనీకాంత్‌ ఆధ్యాత్మికత బాటపట్టి చాలా కాలమైన విషయం తెలిసిందే. ఒక పక్క షూటింగ్‌లతో బిజీగా ఉన్నా, కాళీ సమయాల్లో ఆధ్యాత్మికత చింతనతో హిమాలయాలకు వెళ్లి అక్కడ ధ్యానం, యోగా వంటివి చేసి నూతనోత్సాహంతో తిరిగి వస్తుంటారు. అలా ప్రతి చిత్ర షూటింగ్‌ పూర్తి అయిన తరువాత రజనీకాంత్‌ హిమాలయాలకు వెళ్లి రావడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ప్రస్తుతం కూలీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర షూటింగ్‌ గ్యాప్‌లో ఇటీవల జార్కండ్‌లోని  'యోగా సత్సంగ సొసైటీ రాంజీ' ఆశ్రమానికి వెళ్లి అక్కడ ఒక వారం గడిపి వచ్చారు. 

అక్కడ రజనీకాంత్‌ అనుభవాలను రాంజీ ఆశ్రమం గురించి మీడియాకు విడుదల చేసింది. అందులో రజనీకాంత్‌ పేర్కొంటూ 'వైఎస్‌ఎస్‌ రాంజీ ఆశ్రమానికి తాను ఇప్పటికి 3 సార్లు వెళ్లి వచ్చాను. పరమహంస యోగానందా జీ గదిలో కూర్చుని యోగా చేసే భాగ్యం నాకు దక్కింది. ఆ అనుభవాన్ని మాటల్లో వ్యక్తం చేయలేను. 14 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చాను. ఇకపై ప్రతి ఏడాది ఈ ఆశ్రమానికి వచ్చి ఒక వారం రోజుల పాటు ఉండాలని  నిర్ణయించుకున్నాను. నేను చాలా వైడ్‌గా ఉన్నట్లు నాకే అనిపిస్తోంది. అందుకు కారణం నేను క్రియా యోగా చేయడమే.  

2002లో నుంచి నేను క్రియా యోగా చేస్తున్నాను. ఆరంభ దశలో నాకెలాంటి మార్పు కనిపించలేదు. అయితే 12 ఏళ్ల తరువాత ఆ యోగా వల్ల కలిగిన మార్పును గ్రహించాను. నాలో చాలా ప్రశాంతత, మనశాంతి ఏర్పడింది. క్రియా యోగా శక్తి ఏమిటన్నది దాన్ని గురించి తెలిసిన వారికే అర్థం అవుతుంది. ఇది ఒక పరమ రహస్యం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలంటే ఆ యోగాలో మంచి గురువును కనుగొనాలి. ఆ తరువాత వారిని మనం విడిచి పెట్టినా, వారు మనల్ని వదలరు అని నటుడు రజనీకాంత్‌ పేర్కొన్నారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)